Thursday, July 4, 2024
HomeదైవంChagalamarri: శివ గంగా భవాని అమ్మవారికి విశేష పూజలు

Chagalamarri: శివ గంగా భవాని అమ్మవారికి విశేష పూజలు

పాల్గొన్న తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ సతీమణి

నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో స్థానిక ముత్యాలపాడు బస్టాండ్ వెళ్ళే మార్గంలో శ్రీ శివ గంగా భవాని ఆలయంలో తొమ్మండ్రు నాగేంద్ర కుమార్ ధర్మపత్ని సుప్రజ గార్ల ఆధ్వర్యములో మహిళలు లలిత పారాయణం, అమ్మవారికి చీరె సారే పెట్టారు. రామలక్ష్మి ఆధ్వర్యములో అమ్మవారికి విశేష పూజలు జరిపించారు.

- Advertisement -

పూజారి కైప వెంకట నరసింహ శాస్త్రి మాట్లాడుతూ శ్రీ గంగా భవాని అమ్మవారు ఎంతో మహిమానిత్వమైన అమ్మవారు అని కోరిన కోరికే తీర్చే ఆదిపరాశక్తి అని చెప్పారు. ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలను ప్రసాదించే తల్లి శ్రీ గంగా భవాని అమ్మవారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తొమ్మండ్రు నాగేంద్ర కుమార్, సుప్రజ, తొమ్మండ్రు శ్రీలక్ష్మి, మేకల శ్రీనివాసులు యాదవ్, రామలక్ష్మి, స్వర్ణలత, సమరసత సేవా ఫౌండేషన్ మహిళ సహ కన్వీనర్ యల్లంపల్లే లక్ష్మి దేవి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News