Chaturgrahi Yoga 2025: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం కాలానుగుణంగా రాశులను మార్చి శక్తివంతమైన యోగాలను ఏర్పరుస్తాయి. సెప్టెంబరులో కూడా అలాంటి పవర్ పుల్ యోగమే రూపుదిద్దుకోబోతుంది. సూర్యుడు, శుక్రుడు, కేతువు, బుధుడు కలిసి సింహరాశిలో చతుర్గ్రాహి యోగాన్ని సృష్టించబోతున్నారు. ఇది 50 ఏళ్ల తర్వాత ఏర్పడుతుంది. ఈ అరుదైన యోగం వల్ల కొందరి అదృష్టం మారబోతుంది. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహం
చతుర్గ్రాహి యోగం వల్ల సింహరాశి వారి ఫేట్ మారబోతుంది. ఈ రాశి వ్యక్తులు లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. సమాజంలో పాపులారిటీ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందమయంగా ఉంటుంది. కెరీర్ లో ఎన్నడూ చూడని పెరుగదలను చూస్తారు. అదృష్టం మీ వెంటే తిరుగుతుంది. ఆకస్మికంగా డబ్బు వచ్చి పడుతుంది. విద్యార్థులకు, నిరుద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ శక్తివంతమైన యోగం సత్ఫలితాలను ఇస్తుంది. మీకు అదృష్టం కలిసి రావడంతో ఎలాంటి పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. మీరు చదువు లేదా వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్లే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వంతో నలుగురినీ ఆకట్టుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి ఉంటుంది.
Also Read: Festivals in September 2025 -సెప్టెంబరులో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి చతుర్గ్రాహి యోగం మంచి ఫలితాలను ఇవ్వబోతుంది. వ్యాపారంలో మంచి రాబడి ఉంటుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తారు. లీడర్ షిప్ క్వాలిటీస్ అందరినీ ఆకట్టుకుంటారు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు కలిసివస్తాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. సంసారంలో కలతలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
Disclaimer: ఈ వార్త పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనికి ఎలాంటి ప్రామాణికత లేదు. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also Read: Rishi Panchami 2025 -ఋషి పంచమి మహిళలకు మాత్రమే ఎందుకు ప్రత్యేకం!


