Tuesday, December 3, 2024
HomeదైవంChautuppal: బొబ్బిళ్ళ గురుస్వామికి 'గురు పురస్కారం'

Chautuppal: బొబ్బిళ్ళ గురుస్వామికి ‘గురు పురస్కారం’

మహాశాస్త్ర సేవా సంఘం..

మహాశాస్త్ర సేవా సంఘం హైదరాబాద్ వారు మణికంఠ ఫంక్షన్ హాల్ ఉప్పల్ హైదరాబాదులో ఏర్పాటు చేసిన గురు పురస్కారం ప్రధాన ఉత్సవ కార్యక్రమంలో ఆదివారం గురు పురస్కారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రానికి చెందిన బొబ్బిళ్ళ గురుస్వామికి గురు పురస్కారాన్ని ఆదివారం అందజేశారు.

- Advertisement -

మహాశాస్త్ర సేవా సంఘం ట్రస్ట్ చైర్మన్ సూదగాని రాజు గురుస్వామి, వారి ట్రస్ట్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా కేరళ నుండి శ్రీ నాయర్ పొట్టి తంత్రి, నరసింహ తాంత్రి, రాజు దేశ్ పాండే గురుస్వామి అఖిలభారత ప్రత్యక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు, కేశవులు గురుస్వామి చేతుల మీదుగా గురు పురస్కార అవార్డు అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు గురు స్వాములు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం శబరిమల కేరళలో ఏర్పాట్ల గురించి ప్రతి సంవత్సరం శబరిమలకు వెళ్లే భక్తుల్లో 70 శాతం తెలుగు వాళ్లే ఉంటున్నారు. కాబట్టి అక్కడ యాత్రికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శబరిమల వారు భక్తులకు దర్శనం, వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. శబరిమలకు దీక్ష చేసి వెళ్లే అయ్యప్ప భక్తులు స్వామి వారికి ప్రధానంగా నెయ్యి అభిషేకం చేస్తాం కాబట్టి నాణ్యమైన నెయ్యిని ఇరుముడి టెంకాయలు కొని స్వామివారికి అభిషేకం జరిగే విధంగా తగు జాగ్రత్తలు భక్తులు తీసుకోవాలని గురుస్వాములు కోరారు.

ఈ సంవత్సరం కూడా శబరిమలకు రద్దీ బాగా ఎక్కువ ఉంటుందని శబరిమలలో దేవాలయ కమిటీ వారు పెద్ద వయసు వారికి చిన్న పిల్లలకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయాలని గురుస్వాములు కోరారు. ఈ సందర్భంగా మురళీ గురుస్వామి మాట్లాడుతూ… గురు పురస్కారం తీసుకున్న నాకు మరింత బాధ్యతగా పెరిగిందని, ఈ గురు పురస్కారం ఇచ్చినటువంటి మహాశాస్త్ర ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మహాశాస్త్ర సేవా సంఘం ట్రస్ట్ చైర్మన్ సూదగాని రాజు, ట్రస్ట్ సభ్యులు గురుస్వాములు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News