Saturday, December 28, 2024
HomeదైవంSabarimala: శబరిమల ఆలయం మూసివేత

Sabarimala: శబరిమల ఆలయం మూసివేత

అయ్యప్ప స్వాములు పవిత్రంగా భావించే శబరిమల(Sabarimala) అయ్యప్ప ఆలయం కొన్ని రోజుల పాటు మూతపడనుంది. దేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల దీక్షల సీజన్ ముగిసింది. దీంతో మండల పూజ అనంతరం అధికారులు ఆలయం మూసివేశారు.

- Advertisement -

ఈ నెల 29 వరకు ఆలయం మూసి ఉంచుతారు. అనంతరం తిరిగి మకర విళక్కు సీజన్ కోసం డిసెంబరు 30న సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తామని దేవస్థానం వర్గాలు వెల్లడించాయి. జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా లక్షలాదిగా అయ్యప్ప భక్తులు శబరిమలకు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. అలాగే మకర జ్యోతిని సందర్శించి తన్మత్వం చెందుతారు. ఆ సమయంలో శబరిమల కొండ ప్రాంతం అంతా స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో మార్మోగుతోంది. కాగా ఈ ఏడాది అయ్యప్ప స్వామిని 32,39,756 మంది దర్శించుకున్నారు. గతేడాది 28,42,447 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News