Thursday, April 3, 2025
HomeదైవంCM camp office: శాంతి యజ్ఞంలో జగన్

CM camp office: శాంతి యజ్ఞంలో జగన్

వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించిన సీఎం జగన్

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. ఇటీవల విజయవాడలో ఏపీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిర్వహించిన అష్టోత్తర శతకుండాత్మక (108) చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞంలో పాల్గొన్నారు సీఎం. మహాయజ్ఞం విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా వేద పండితుల సూచనల మేరకు, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు నిమిత్తం గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు వేదపండితులు.

- Advertisement -

ముఖ్యమంత్రితో పాటు శాంతి యజ్ఞంలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం (దేవాదాయ, ధర్మాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ. శాంతి యజ్ఞంలో పాల్గొన్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News