Daily Horoscope Today 29 August,2025: మనలో చాలా మంది ఏ పని మెుదలుపెట్టాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటారు. ఈ నేపథ్యంలో భాద్రపద మాసం శుక్ల పక్షం శుక్రవారం (ఆగష్టు 29వ తేదీ) ఒక్కొక్క రాశి యెుక్క రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషం
ఆర్థిక పురోగతి సాధిస్తారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది తలెత్తదు.
వృషభం
కెరీర్ తీరిక లేకుండా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కొన్ని శుభవార్తలు కూడా వింటారు. వ్యాపారులు ఆశించిన లాభాలు పొందుతారు. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మిథునం
ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. సంపద వృద్ధి చెందుతుంది. సన్నిహితులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. మీ లైఫ్ పార్టనర్ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోండి.
కర్కాటకం
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వ్యక్తిగత వివాదాలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. చేతికి రావాల్సిన డబ్బు అందుతుంది. మీ పనితీరుతో ఉన్నతాధికారులను మెప్పిస్తారు. ఉద్యోగ యోగం ఉంది.
సింహం
సింహరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. శాలరీ పెరిగే సూచనలైతే కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్స్ వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
కన్య
ఆర్థిక వ్యవహారాలు చక్కబడతాయి. ఆస్తి వివాదం సద్దుమణుగుతుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని భారం తగ్గుతుంది. మీ హోదాలో మార్పు వచ్చే అవకాసం ఉంది. బంధువులు నుంచి రావాల్సిన డబ్బు అందుతుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.
తుల
ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
Also Read: Festivals in September 2025 -సెప్టెంబరులో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
వృశ్చికం
నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగావకాశాలు అందుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
ధనుస్సు
అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగ, వ్యాపారాలు బాగుంటాయి.
మకరం
మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మీకే మంచిది.
కుంభం
ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యానికి అవకాశం ఉంది. ఉద్యోగుల అదనపు బాధ్యతలు తీసుకుంటారు. ఫ్యామిలీతో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశం ఉంది.
మీనం
కెరీర్ బాగుంటుంది. ఆదాయం ఎలా వస్తుందో ఖర్చులు కూడా అదే విధంగా ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు మంచి స్పందన వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాసం ఉంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది.
Also Read:Budh Gochar 2025-సెప్టెంబరులో సుడి తిరగబోతున్న రాశులు ఇవే..!
Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా అందించినవి మాత్రమే. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


