Sunday, November 16, 2025
HomeTop StoriesDhanteras 2025: ధన త్రయోదశి రోజున ఉప్పు తో ఈ పని చేయండి చాలు..సంపదకు లోటే...

Dhanteras 2025: ధన త్రయోదశి రోజున ఉప్పు తో ఈ పని చేయండి చాలు..సంపదకు లోటే ఉండదు!

Dhan Trayodashi Laxmi Puja:ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథిన ధన త్రయోదశిని హిందువులు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ఇది దీపావళి వేడుకలకు ప్రారంభమైన శుభదినంగాపండితులు వివరిస్తారు. సంపద, ఆరోగ్యం, శ్రేయస్సును అందించే రోజుగా ఈ రోజుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

- Advertisement -

లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవిని..

ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీదేవి, కుబేరుడు, ధన్వంతరి దేవిని పూజించడం ఆచారం. లక్ష్మీదేవి సంపదకు, కుబేరుడు ధనాధికారానికి, ధన్వంతరి దేవుడు ఆయురారోగ్యానికి ప్రతీకలు. అందువల్ల ఈ ముగ్గురిని పూజించడం ద్వారా జీవితం మొత్తం శ్రేయస్సుతో నిండిపోతుందని పురాణాలు చెబుతున్నాయి.

Also Read:https://teluguprabha.net/devotional-news/samsaptaka-rajayoga-brings-prosperity-for-four-zodiac-signs/

ఈ సందర్భంగా ప్రజలు బంగారం, వెండి ఆభరణాలు, కొత్త పాత్రలు, లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అది ఆర్థిక స్థిరత్వం, శుభప్రారంభానికి సంకేతంగా పండితులు చెబుతారు. కొత్త వస్తువులు కొనడం అంటే కొత్త శక్తి, కొత్త అదృష్టాన్ని ఆహ్వానించడం అని నమ్మకం.

ధన్ తేరస్ 2025 తేదీ, సమయ వివరాలు

ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షం త్రయోదశి తిథి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12:18 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 19న మధ్యాహ్నం 1:51 గంటల వరకు ఉన్నట్లు పండితులు వివరిస్తున్నారు. పంచాంగ సూచనల ప్రకారం తిథి ఉదయం నుంచే ప్రారంభమవుతుందని, కనుక ధన్ తేరస్ పూజలు అక్టోబర్ 18న జరపడం మంచిదని పండితులు చెబుతున్నారు.

ఈ రోజు గృహస్థులు, వ్యాపారులు, కుటుంబాలు సాయంత్రం సమయానికి లక్ష్మీ పూజ, దీపారాధన, ధన్వంతరి పూజలను నిర్వహిస్తారు. రాత్రి దీపాలు వెలిగించడం సంపదకు సంకేతమని, అది జీవితంలో వెలుగును, సమృద్ధిని తీసుకువస్తుందని నమ్మకం ఉంది.

ఉప్పుతో సంబంధించిన ఆచారాల వెనుక అర్థం

ధన్ తేరస్ రోజున ఉప్పుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది అని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఉప్పు శుద్ధతకు, నెగెటివ్ ఎనర్జీని తొలగించడానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఇంటిలో ఉన్న వాస్తు దోషాలను తొలగించాలంటే ఈ రోజు ఉప్పు కలిపిన నీటితో నేలను శుభ్రం చేయడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఇంటిలో ఉన్న దోషాలను తొలగించి సానుకూల శక్తిని తెస్తుందనేది నమ్మకం.

మరో విశ్వాసం ప్రకారం ఈ రోజున ఉప్పు కొనడం శుభప్రదం. ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో ఒకటిగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున ఉప్పు కొనడం లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని పండితులు చెబుతారు.

అయితే, అదే రోజున ఉప్పుతో సంబంధిత లావాదేవీలు చేయడం మాత్రం శుభకరం కాదని సూచిస్తారు. అంటే ఈ రోజున ఉప్పును అప్పుగా తీసుకోవడం లేదా ఇవ్వడం నివారించాలి. జ్యోతిష్య ప్రకారం ఉప్పుతో అప్పు ఇవ్వడం అంటే ఆర్థిక ప్రవాహంలో ఆటంకాలు కలుగుతాయనేది నమ్మకం.

ధన్ తేరస్ పూజా విధానాలు, దాన ధర్మాలు

ఈ రోజున సాయంత్రం సమయానికి గృహిణులు ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాలు వెలిగిస్తారు. ఆ వెలుగుతో పాటు ఉప్పు కలిపిన నీటిని గుమ్మం ముందు చల్లడం దుఃఖం, పేదరికం దూరం చేస్తుందని చెబుతారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది.

అదేవిధంగా ధన్ తేరస్ రోజున దానం చేయడమూ చాలా ముఖ్యమైన ఆచారం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా ఆహారం, డబ్బు లేదా వస్తువులను దానం చేస్తారు. ఇది సమాజంలో సమతుల్యతను కల్పించడమే కాకుండా కర్మ ఫలితాలుగా శుభఫలితాలను ఇస్తుందని భావిస్తారు.

పండుగ వెనుక జ్యోతిష్య ప్రాముఖ్యత

జ్యోతిష్యం ప్రకారం ధన్ తేరస్ నాడు చీకటి పక్షంలో వెలుగును వెలిగించడం అంటే మనలోని అంధకారాన్ని తొలగించి జ్ఞానం, సంపద, ఆరోగ్యం పొందడం అని భావిస్తారు. ధన్వంతరి దేవుడు ఈ రోజున సముద్ర మథన సమయంలో అమృతంతో బయటకు వచ్చినందున ఈ రోజును ఆయురారోగ్య దినంగా కూడా పరిగణిస్తారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/lucky-palm-signs-and-their-meanings-in-palmistry/

ధన్ తేరస్ రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించడం, బంగారు వస్తువులు కొనడం, ధన్వంతరి మంత్రాన్ని జపించడం వంటి చర్యలు శుభప్రదంగా చెప్పబడతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రోజున ధన్వంతరి దేవుడి పూజ చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని నమ్మకం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad