Don’t Do These Mistakes on Kartik Purnima: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు ఇళ్లు శుద్ధి చేసుకొని శివుడికి పూజలు చేస్తారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఈ రోజున దేవతలు సైతం భూమిపైకి దిగి వచ్చి దీపావళి పండుగను జరుపుకుంటారని చెబుతారు. దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. అంతేకాక, ఈ శుభదినం నాడు గురు నానక్ దేవ్ జీ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈ కారణంగా కార్తీక పౌర్ణమి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత మరింత సంతరించుకుంది. ఈ పవిత్రమైన కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని భక్తి, విశ్వాసంతో జరుపుకోవాలని, భక్తులు ఈ రోజు తప్పకుండా కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదని సలహా ఇస్తున్నారు. ఈ పనులను చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు. మరి, కార్తీక పౌర్ణమి నాడు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.
కార్తీక పౌర్ణమి రోజు చేయకూడని పనులివే..
తులసి ఆకులను తుంచవద్దు
కార్తీక పౌర్ణమి రోజు తులసి ఆకులను అస్సలు తుంచకూడదు. హిందూ ధర్మంలో తులసిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఈ శుభదినాన తులసి ఆకులను తుంచడం వల్ల లక్ష్మీదేవిని అగౌరవించినట్లుగా భావిస్తారు. ఇది దురదృష్టాన్ని తీసుకొస్తుందని పండితులు చెబుతున్నారు.
తామస ఆహారానికి దూరం
కార్తీక పౌర్ణమి రోజు ఉపవాసం పాటించినా, పాటించకపోయినా మాంసాహారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. మాంసం, చేపలు, గుడ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి తామస ఆహారాలు ఆధ్యాత్మిక పవిత్రతకు భంగం కలిగిస్తాయి. కాబట్టి వాటిని తినకూడదు.
ఎవరినీ ఖాళీ చేతులతో పంపవద్దు
ఈ పవిత్రమైన రోజున ఇంటికి ఏదైనా అవసరంలో ఉన్నవారు.. పేదవారు లేదా వృద్ధులు వస్తే వారిని ఖాళీ చేతులతో వెనక్కి పంపకూడదు. మీ శక్తికి అనుగుణంగా ఆహారం, పండ్లు, ఇతర వస్తువులను దానం చేయాలి.
ఈ వస్తువులను దానం చేయవద్దు
కార్తీక పౌర్ణమికి చంద్రుడికి సంబంధం ఉంటుంది. కాబట్టి, ఈ రోజున పాలు, వెండి లేదా తెల్లని వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు. శాస్త్రాల ప్రకారం.. ఇలా చేయడం వల్ల చంద్ర దోషం పెరుగుతుందని పరోహితులు చెబుతున్నారు.
ఇంటిని చీకటిగా ఉంచవద్దు
కార్తీక పౌర్ణమి రోజున ఇంటిని చీకటిగా ఉంచకూడదు. ప్రతి గదిలో దీపాలు వెలిగించి వెలుగు ఉండేలా చూసుకోవాలి. తద్వారా మంచిని ఆహ్వానించి, చెడును పారద్రోలాలి. వీటిని పాటించడం ద్వారా దేవ దీపావళిని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.


