Vipreet Rajyog effect on Zodiacs: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని కర్మఫలదాత, న్యాయదేవుడు అని పిలుస్తారు. శని రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మారుస్తాడు. ప్రస్తుతం ఇతడు మీనరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. నవంబరు వరకు అదే స్థితిలో ఉండి ఆ తర్వాత మార్గంలోకి వస్తాడు. శని సాధారణ స్థితిలోకి వచ్చినప్పుడు విపరీత రాజయోగం ఏర్పడుతోంది. ఇది కొన్ని రాశులవారిని ధనవంతులను చేస్తోంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహరాశి
విపరీత రాజయోగం సింహరాశి వారికి అనేక విధాలుగా బెనిఫిట్స్ ను అందిస్తుంది. మీరు ఎన్నో ఏళ్లుగా చేస్తున్న పోరాటం సఫలమవుతుంది. కార్యసాధనలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ లో ఆకస్మికంగా ఎదుగుదల కనబడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.
తులా రాశి
శనిదేవుడు చేస్తున్న విపరీత రాజయోగం తులరాశి వారి తలరాతను మార్చబోతుంది. అనతి కాలంలోనే వృద్ధి చెందుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. మీ కృషికి తగిన ఫలితాలను పొందుతారు. అనారోగ్యం నుండి బాధపడుతుంటే దాని నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సుఖసంతోషాలు ఉంటాయి.
Also Read: Raksha Bandhan 2025 – రాఖీ పండుగ నాడు ఈ గిఫ్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి!
మిథునరాశి
మిథునరాశి వారికి విపరీత రాజయోగం అనుకోని లాభాలను ఇస్తుంది. అదృష్టం ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో సఫలీకృతమవుతారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి.
Also Read: Hindu Mythology- పాముల్లో ఏది అత్యంత శక్తివంతమైనది.. శేష నాగ, వాసుకి, తక్షకుడా?
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలు, పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


