Shravana Masam Horoscope: హిందువులకు పవిత్రంగా భావించే శ్రావణ మాసం ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఇది ఆగస్టు 23 వరకు కొనసాగనుంది. ఈ మాసంలో కొన్ని రాశులవారి అదృష్టం పండనుంది. శుభగ్రహలుగా పరిగణించబడే గురు, బుధ, శుక్రుల అనుకూల సంచారం కారణంగా వీరి సుడి తిరగబోతుంది. ఈరాశులవారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని ఫలితాలను చూస్తారు. ఆర్థికంగా పరిస్థితి అద్భుతంగా ఉండబోతుంది. ఇంతకీ ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కన్య
ఈ రాశివారికి బుధుడు, శుక్రుడు లాభస్థానంలో ఉండటం కలిసి వస్తుంది. వీరు దిన దినాభివృద్ధి చెందుతారు. ప్రతి పనిలో పురోగతి ఉంటుంది. మీరు నలుగురి చేత ప్రశంసించబడతారు. బిజినెస్ చేసేవారికి భారీగా లాభాలు కలుగతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కెరీర్ లో ఎదుగుదలకు అవకాశం ఉంది. ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటారు.
తుల
శుక్రుడు, బృహస్పతి స్థానం తులరాశి వారికి లాభిస్తుంది. శ్రావణ మాసంలో వీరి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగ యోగం ఉంది. గుడ్ న్యూస్ వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపారాల పరంగా ఈసమయం మీకు కలిసి వస్తుంది. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది.
మేషం
శుక్రుడు స్థానం మేషరాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగా శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు వస్తాయి. పెళ్లికాని వారికి వివాహయోగం ఉంది. పిల్లలు లేని దంపతులకు సంతానప్రాప్తి కలుగవచ్చు. మీకు అనేక మార్గాల ద్వారా డబ్బు వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు బాగుంటుంది.
వృషభం
ఈ రాశికి అధిపతి శుక్రుడు. పైగా గురుడు, శని కూడా శుభస్థానాల్లో ఉన్నారు దీంతో వృషభరాశి వారిపై కనకవర్షం కురవనుంది. ఆగస్టు 23 వరకు వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. దుష్ట గ్రహమైన రాహువు కూడా మీకు సహాయపడుతుంది. మీ సంపద అనేక రెట్లు పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థిక సమస్యలు దూరమయ్యే.. మీరు సంతోషంగా ఉంటారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఊహించని లాభాలు పొందుతారు. మీరు కోరుకున్న కోరికలు సకాలంలో నెరవేరుతాయి.
మిథునం
బుధ, గురు గ్రహాల స్థాన బలం కారణంగా మిథునరాశి వారు నెల రోజులపాటు అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది. వీరి సంపద భారీగా పెరుగుతుంది. డబ్బును పొదుపు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. డబ్బు సమస్యలన్నీ మటుమాయం అవుతాయి. కెరీర్ పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.


