Dhanteras 2025 Horoscope: ఐదు రోజులపాటు జరుపుకునే దీపావళి వేడుక ధనత్రయోదశితో ప్రారంభం అవుతుంది. ఈ పండుగ అక్టోబర్ 18న వచ్చింది. అయితే ఈ పర్వదినం ముందు రోజు సూర్యుడు, కుజ గ్రహాల కలయిక తులా రాశిలో జరిగింది. వీరిద్దరి సంయోగం వల్ల మూడు రాశులవారి అదృష్టం మారబోతుంది. ఆ రాశులకు లక్ష్మీదేవితోపాటు కుబేరుడి అనుగ్రహం ఉంటుంది. ఆ లక్కీ రాశులవారు ఎవరో తెలుసుకుందాం.
తులా రాశి
రెండు గ్రహాల సంయోగం తులారాశి వారి తలరాతను మార్చబోతుంది. ఈ సమయంలో ఉద్యోగ లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉండబోతుంది. పూర్వీకుల ఆస్తి మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తొలగిపోతాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ విపరీతంగా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
సింహరాశి
సూర్యుడు-కుజ గ్రహాల కలయిక సింహరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న పనులు కంప్లీట్ అవుతాయి. ఉద్యోగులు మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. మీ కృషికి తగిన ఫలితాలు ఉంటాయి. మీ కెరీర్ లో ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఆదాయం భారీగా పెరుగుతుంది.
కుంభ రాశి
ధనత్రయోదశి నాడు కుంభరాశి వారికి కలిసి వస్తుంది. ఉద్యోగుల ప్రమోషన్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. పెళ్లి కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. డబ్బును పొదుపు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాలు బాగుంటాయి.
Also Read: Dhanteras 2025 – ధన్‌తేరాస్ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులు కొన్నారో..ఇక అంతే సంగతులు!
కన్యా రాశి
కన్యా రాశి వారికి సూర్యుడు-అంగారకుడు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేపట్టే ప్రాజెక్టు కంప్లీట్ అవుతాయి. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. భారీగా ధనార్జన చేస్తారు.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పూర్తిగా నిజమని చెప్పలేం. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


