Surya Shani yuti 2025 effect: ప్రతి నెలా గ్రహాలు రాశులను మారుస్తాయి. ఈ క్రమంలో ఇతర గ్రహాలతో కలిసి ప్రత్యేక సంయోగాన్ని ఏర్పరుస్తాయి. న్యాయదేవుడైన శని ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. రేపు(సెప్టెంబరు 27) ఇతడు సూర్యుడితో కలిసి సంయోగం చెందబోతున్నాడు. వీరిద్దరి కలయిక ద్వాదశ రాశులపై పడుతుంది. శని, సూర్యల కలయిక వల్ల ఏయే రాశులకు మంచి రోజులు రాబోతున్నాయో తెలుసుకుందాం.
మిథున రాశి
మిథునరాశి వారికి సూర్యుడు, శనిదేవుడు కలయిక శుభకరంగా ఉంటుంది. అసంపూర్తిగా ఆగిపోయిన పనులు కంప్లీట్ అవుతాయి. ఫ్యామిలీ సపోర్టుతో ఎలాంటి పనినైనా సులభంగా చేస్తారు. మీరు ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఫ్యూచర్ లో భారీగా లాభాలు ఉంటాయి. పిల్లలకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. లక్ కలిసి రావడంతో ఎలాంటి పనినైనా విజయవంతంగా చేయగలుగుతారు.
వృశ్చిక రాశి
రెండు పెద్ద గ్రహాల కలయిక వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. వీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఎక్కువ లాభాలు ఉంటాయి. విద్యార్థులతోపాటు పోటీపరీక్షలకు సిద్దమయ్యే వారు కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. కెరీర్ లో సక్సెస్ ఉంటుంది. అప్పుల ఊబి నుండి బయటపడతారు. ఆకస్మికంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.
Also Read: Lalita Panchami 2025-లలితా పంచమి నేడే.. అమ్మవారిని పూజించడానికి శుభ ముహూర్తం ఇదే..
వృషభరాశి
తండ్రీకొడుకుల సంయోగం వృషభరాశి వారికి అద్బుతంగా ఉండనుంది. దసరాకు ముందు వీరి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతుంది. వ్యాపారంలో అధికంగా లాభాలు ఉంటాయి. విద్యార్థులు మంచిగా చదువుకుంటారు. ఆఫీస్ స్టాఫ్ తోపాటు కుటుంబ నుంచి ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలు ఊహించని విధంగా కలిసి వస్తాయి.
Also Read: Diwali 2025 – ఈ ఏడాది దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి..20 నా..21 నా..!
Disclaimer: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు పండితుల సూచనల ఆధారంగా దీనిని రూపొందించడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


