Sunday, November 16, 2025
HomeదైవంMahayuti 2025: సింహరాశిలో మూడు గ్రహాల మహా సంయోగం.. ఈ 3 రాశుల...

Mahayuti 2025: సింహరాశిలో మూడు గ్రహాల మహా సంయోగం.. ఈ 3 రాశుల వారికి వరం..

- Advertisement -

Sun Mercury and Ketu Conjunction in Leo 2025: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చి శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్న బుధుడు ఈ నెల చివరిలో అంటే ఆగస్టు 30 సాయంత్రం 4:39కి సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. అప్పటికే అదే రాశిలో ఛాయా గ్రహమైన కేతువు, గ్రహాల రాజైన సూర్యుడు ఉంటారు. దీంతో సింహరాశిలో సూర్య-బుధ-కేతు సంయోగం సంభవించబోతుంది. ఈ మూడు గ్రహాల కలయిక కొందరికి శుభఫలితాలను ఇవ్వబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

కర్కాటక రాశి

మూడు గ్రహాల మహాసంయోగం కర్కాటక రాశి వారికి సత్ఫలితాలను ఇవ్వబోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీ వ్యక్తిత్వంతో ఆకట్టుకుంటారు. సొంతంగా వ్యాపారం చేసుకునే వారు ఊహించని లాభాలను పొందుతారు. పాత మిత్రులను కలుస్తారు. ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు పొందుతారు. కెరీర్ లో అనుకొని పురోగతి ఉంటుంది. మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు.

ధనస్సు రాశి

గ్రహాల మహా సంయోగం ధనస్సు రాశివారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఆర్థికపరంగా మంచి పొజిషన్ లో ఉంటారు. కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆగిపోయిన పనులు కంప్లీట్ అవుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది. నిరుద్యోగ యువకులకు ఉద్యోగం లభిస్తుంది. వైవాహిక జీవితంలోని కలతలన్నీ భార్యభర్తలు అన్యోన్యంగా ఉంటారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. మెుత్తానికి ఈ సమయం కలిసి వస్తుంది.

Also Read: Blood Moon 2025- బ్లడ్ మూన్ ఎప్పుడు? ఇది మన దేశంలో కనిపిస్తుందా?

వృశ్చిక రాశి

బుధ-కేతు-సూర్య గ్రహాల సంయోగం వృశ్చిక రాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారులకు అనుకొని లాభాలు ఉంటాయి. ఇంతక ముందు పెట్టిన పెట్టుబడులు ఈసారి లాభాలను ఇస్తాయి. ప్రేమ చిగురుస్తుంది. దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సంతానప్రాప్తికి అవకాశం ఉంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది.

Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. ఇది పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనదని మేము చెప్పలేం. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.

Also Read: Sun Transit 2025- హస్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు ఆఖండ ధనయోగం..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad