Eating On The Bed Vs Vastu:వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఇంట్లో చేసే ప్రతి చిన్న పనికీ ప్రత్యేకమైన ప్రభావం ఉంటుంది. మన ఇంటి నిర్మాణం, అలవాట్లు, దైనందిన కార్యకలాపాలు ఇలా అన్ని కలిసి మన జీవితంలోని శ్రేయస్సు, ఆనందం, సంపదపై ప్రభావం చూపుతాయి. చాలా మంది సౌకర్యం కోసం మంచం మీద కూర్చుని భోజనం చేయడం పెద్ద విషయంగా తీసుకోరు. కానీ వాస్తు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఇది చిన్న విషయం కాదు. ఈ అలవాటు ఇంట్లో ఉన్న సానుకూల శక్తులను దెబ్బతీసి దరిద్రాన్ని ఆహ్వానించాడానికి మార్గమని పండితులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
భోజనం చేసే ప్రదేశం..
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనం అనేది పవిత్రమైన కార్యం. దీన్ని గౌరవంతో చేయాలి. మనం భోజనం చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. కానీ మంచం మీద కూర్చుని తినడం వలన ఆ పవిత్రత మొత్తం పోతుంది. ఇలాంటప్పుడు అన్నపూర్ణ దేవి ప్రసన్నంగా ఉండే అవకాశాలు లేవనే నమ్మకం చాలా మందిలో ఉంది. ఆమె కృప తగ్గితే ఇంట్లో సౌఖ్యం, ధనం తగ్గిపోతాయని వాస్తు గ్రంథాలు వివరిస్తున్నాయి.
ఇంటి సభ్యులు తరచూ మంచం మీద కూర్చొని తింటుంటే కనుక ఆ ఇంట్లో ఉన్న వాతావరణం నెమ్మదిగా ప్రతికూలంగా మారుతుందని పండితులు అంటున్నారు. ఇలాంటివాటితో శారీరకంగా కూడా సమస్యలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు.
జీర్ణక్రియ..
జీర్ణక్రియ సరిగా పనిచేయకపోవడం, అలసట, చిరాకు, తగాదాలు పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాస్తు దృష్ట్యా చూస్తే, ఈ అలవాటు రాహువు దోషాన్ని ప్రేరేపిస్తుంది. దీని ప్రభావంతో మనం ఎంత కష్టపడ్డా, పురోగతిలో ఆటంకాలు వస్తాయని పండితులు వివరిస్తున్నారు.
విశ్రాంతి కోసం మాత్రమే..
ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే, మంచం విశ్రాంతి కోసం మాత్రమే అనే విషయం గుర్తుంచుకోవాలి. అది శరీరానికి విశ్రాంతి, మనసుకు ప్రశాంతత ఇవ్వాలి. కానీ అదే మంచం మీద భోజనం చేస్తే ఆ స్థలం శక్తి సమతుల్యతను కోల్పోతుంది. దాంతో ఇంట్లో ఉన్న శుభశక్తి తగ్గి, దుష్ఫలితాలు అధికమవుతాయి. వాస్తు ప్రకారం ఇది దరిద్రాన్ని ఆహ్వానించే అలవాటుగా పండితులు వివరిస్తున్నారు.
వంటగదిని శుభ్రంగా…
భోజనం చేసే ముందు అన్నపూర్ణ దేవిని స్మరించడం, కృతజ్ఞత చెప్పడం శ్రేయస్కరమని పండితులు వివరిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత వంటగదిని శుభ్రంగా ఉంచడం కూడా చాలా అవసరం. రాత్రిపూట వంటగదిలో మురికి పాత్రలు ఉంచడం వాస్తు పరంగా ప్రతికూలతను కలిగిస్తుంది. అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ విభేదాలు ఏర్పడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
తినే దిశ కూడా..
భోజనం చేసే దిశ కూడా వాస్తు శాస్త్రంలో ప్రాముఖ్యం కలిగి ఉంది. తూర్పు లేదా ఉత్తరం ముఖంగా కూర్చుని తినడం ఆరోగ్యానికి, మనశ్శాంతికి అనుకూలంగా ఉంటుంది. ఈ దిశలలో భోజనం చేయడం వలన సానుకూల శక్తులు మన శరీరంలో ప్రవహిస్తాయని నమ్మకం ఉంది. అలాగే, నేలపై లేదా డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని భోజనం చేయడం వాస్తు పరంగా సరైన పద్ధతిగా సూచిస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/saturn-venus-conjunction-to-benefit-virgo-capricorn-pisces/
ఇంట్లో ఉన్న ప్రతికూలతలు ఎక్కువయ్యాయని అనిపిస్తే, మొదటగా అలవాట్లను పరిశీలించడం అవసరం. మంచం మీద భోజనం చేయడం వంటి చిన్న అలవాట్లే పెద్ద సమస్యలకు కారణమవుతాయని పండితులు హెచ్చరిస్తున్నారు. దీనిని ఆపి వాస్తు నియమాలను పాటిస్తే ఇంట్లో శ్రేయస్సు తిరిగి వస్తుందని సూచిస్తున్నారు.
తినే ప్రదేశాన్ని శుభ్రం..
మన పూర్వీకులు కూడా భోజనానికి ముందు తినే ప్రదేశాన్ని శుభ్రం చేయడం, నేలపై కూర్చొని తినడం వంటి పద్ధతులు పాటించేవారు. ఆ పద్ధతుల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను ఈరోజు వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవి కేవలం ఆచారాలు కాదు, ఆరోగ్యం, సౌఖ్యానికి సంబంధించిన శాస్త్రీయ విధానాలే అని తెలుపుతున్నారు.
మనసును ప్రశాంతంగా..
అంతేకాకుండా, భోజనం చేసే సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచడం కూడా చాలా అవసరం. టీవీ చూస్తూ, మొబైల్ చూస్తూ తినడం వాస్తు పరంగా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇది ఆహారంపై మన దృష్టిని తగ్గించి, జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది.


