Friday, July 5, 2024
HomeదైవంUrukunda Eeranna: ఉరుకుందలో ధ్వజారోహణ ఉత్సవాలు

Urukunda Eeranna: ఉరుకుందలో ధ్వజారోహణ ఉత్సవాలు

ఈరన్నకు ఘనంగా ఉత్సవాలు ప్రారంభం

కర్నూలు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఉరుకుంద గ్రామంలో వెలసిన ఈరన్న స్వామి (నరసింహ స్వామి) శ్రావణ మాస ఉత్సవాల్లో భాగంగా ధ్వజారోహణ వేడుకలు కనుల పండుగగా నిర్వహించారు.. ఆలయ పాలక మండలి చైర్మన్ నాగరాజు గౌడ్, ఆలయ ఈవో వాణి, ప్రధాన అర్చకుడు వీరప్ప స్వామి ఆధ్వర్యంలో ధ్వజారోహణ వేడుకలను.. నిర్వహించారు.. గణపతి పూజ, గోపూజలను శాస్త్రబద్ధంగా నిర్వహించారు..

- Advertisement -

ఉత్సవాలను పురస్కరించుకొని ఈరన్న స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.. వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేలాదిగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు.. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు రామ్మోహన్, వెంకటేశ్వరరావు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు… ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పి సీతారామయ్య ఆధ్వర్యంలో ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు….

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News