Wednesday, May 21, 2025
HomeదైవంEmmiganuru: శరీరానికి శూలాలు గుచ్చుకొన్న భక్తులు

Emmiganuru: శరీరానికి శూలాలు గుచ్చుకొన్న భక్తులు

శ్రీ సుబ్రహ్మాణ్యే శ్వర స్వామి రథోత్సవం ఎమ్మిగనూరులో వైభవంగా జరిగింది.  దేవస్థానం ధర్మకర్త యూజి కేశవర్ధన, యూజీ ప్రకాశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీ నిత్యానంద స్వాముల వారి ఆశ్సీస్సులతో గత 39 సంవత్సరములుగా శ్రీ సుబ్రమణ్యేశ్వర స్వామి రథోత్సవమును భక్తులు ఒళ్ళు గగుర్పాటు పొడిచే విధంగా శరీరానికి శూలాలు గుచ్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తిని చాటుకుంటారు. పట్టణంలోని  శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము (సోమప్ప సర్కిల్) నందు గల శమీ వృక్షము నుండి శ్రీ సుబ్రమణ్య స్వామి సన్నిధికి కాపళ్ళతోను, సత్యవేణితోను, వీధుల గుండా ఊరేగిస్తూ శ్రీ సుబ్రహ్మణ్యే శ్వర స్వామి వారి రథోత్సవమును వైభవోపేతంగా నిర్వహించారు.

- Advertisement -

అనంతరం శ్రీ సుబ్రమణ్యస్వామి అభిషేకము, భస్మ పూజ, మహామంగళ హారతి, సహస్ర పుష్పార్చన, ప్రసాద వినియోగము ఘనంగా నిర్వహించారు.  అలాగే అన్నదానం చేశారు. సాయంత్రం శ్రీ స్వామివారి పల్లకి ఊరేగింపు మహోత్సవమును నిర్వహించారు. ఆలయ అర్చకులు శివమణి స్వామితో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News