Sunday, November 24, 2024
HomeదైవంGanga Pushkar: ఈనెల 22 నుంచి గంగానదికి పుష్కరాలు

Ganga Pushkar: ఈనెల 22 నుంచి గంగానదికి పుష్కరాలు

భారతదేశంలో గంగానది అత్యంత ప్రముఖమైనది పవిత్రమైననది, శ్రీపుష్కర స్నానం పవిత్రమైనది. పుష్కరస్నానం చేయడం వల్ల పాపహరణం అవుతుందని హిందువులకు. అతిపెద్ద నమ్మకం. నాగసాధువులు, అఘోరాలు ఈపుష్కరాల్లో ఎక్కువగా కనిపిస్తారు. పుష్కరుడు ఒక సంవత్సరం ఏ నదిలో పుష్కరాలు జరిగితే ఆ నదిలో ఉంటారు. ఈసంవత్సరం ఏప్రిల్ 22న గంగా పుష్కరాలు ప్రారంభం అవుతాయి. పుష్కరకి అర్ధం 12 సంవత్సరాలు అని అర్థం. గంగా పుష్కరాలు 12 సంవత్సరాల తర్వాత వచ్చింది. గంగాపుష్కరం బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు ఏప్రిల్ 22న ప్రారంభం అవుతుంది, బృహస్పతి మీనంలో ప్రవేశించి నప్పుడు మే 3, 2023న ముగుస్తుంది. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం మొదలవుతుంది, బృహస్పతి పన్నెండో రాశి అయిన మీనంలో ప్రవేశించినప్పుడు గంగాపుష్కరం పూర్తి అవుతుంది. పుష్కరకాలము సాధారణంగా ఒక సంవత్సరము పాటు ఉంటుంది. అయితే పుష్కర కాలములోని మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని, చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరమని వ్యవహరిస్తారు. ఈ మొదటి, చివరి పన్నెండు రోజులు మరింత ప్రత్యేకమైనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో కలిసి వచ్చి ఉంటాడని ఈ పన్నెండు రోజూలలో గంగానదిలో స్నానం చేయటం వలన సకల తీర్థాలలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుందని గంగానదిలో అనేక మంది భక్తులు స్నానాలు చేస్తారు.
“పుష్కరుడి కథ”
పుష్కరుడు ఒక విప్రుడు. బ్రహ్మ దేవుడు పుష్కరుడు సృష్టికర్త. పుష్కరుడు మహా శివుడి కోసం తపస్సు చేశాడని పురాణాల్లో ఉంది. పుష్కరుని తీర్థరాజు అని పిలుస్తారు. సామాన్యులు అందరూ నది స్నానం చేయడం వల్ల ఆ నది పవిత్రత క్షీణించడానికి గమనించిన పుష్కరుడు చాలా చింతించేవాడు. దాని కోసం పరమ శివుడి కోసం తపస్సు చేసి నదుల దోషములు అన్నింటిని ప్రక్షాళన చేసే మార్గాన్ని అర్థించాడు. అతని తప్పసుకి మెచ్చి శివుడు పుష్కరుడుకి తను కోరిన వరం ఇస్తాడు. శివుని వరం వల్ల పుష్కరుడు పవిత్రుడు మరియు అనంతమైన శక్తి ప్రాప్తించింది అవుతారు. పుష్కరుడు ఆ నదిలోకి ప్రవేశిస్తాడో ఆనది పవిత్రం అవుతుంది. నదులలోని పాపాలన్నింటినీ తొలగించ గలగే వరం లభించింది. ఆ కారణం వల్ల 12 నదులన్నీ తమలో పవిత్రత నింపాలి అని పుష్కరుడు కోరుకుంటాడు. అటుపిమ్మట పన్నెండు పుణ్య నదులలో పుష్కరుడు ఉండేలా ఏర్పాటు అయింది. బృహస్పతి యొక్క సంచారాన్ని బట్టి పుష్కరాలు నిర్ణయించబడతాయి. అంటే మిథున రాశి, వృషభ రాశి, మేష రాశి, కన్య రాశి ఎలా మొత్తం అన్నీ రాశుల్లో ఎప్పుడైతే గురుడు సంచరిస్తుంటాడో, అప్పుడే పుష్కరుడు నదుల్లో నివసించేలా చేసుకుంటాడు. పుష్కరుడు ప్రవేశిస్తుంచిన మొదటి 12 రోజులను పుష్కరాలు అని అంటారు. ఒక సంవత్సరం పాటు ఆ నదిలో ఉంటారు కానీ ఆది పుష్కరం ముగిసిన తర్వాత మధ్యాహ్నం సమయంలో ఒక్క 2 ముహూర్త కాలంలో మాత్రమే ఉంటారు.దేవగురుడైన బృహస్పతి పన్నెండు రాశుల్లోనూ ఏడాదికి ఒకరాశి, చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఒక రాశినుంచి మరో రాశిలోనికి మారిన మొదటి పన్నెండు రోజులు పుష్కరాలుగా నిర్ణయిస్తారు. ఒక్కో ఏడాది ఒక్కోనది చొప్పున భారతదేశంలోని పన్నెండు పవిత్రనదులకు వరుసగా పుష్కరాలు ఉంటాయి. ఆప్రకారం 2023 ఏప్రిల్ 22 శనివారం నుంచి 2023 మే 3 బుధవారం వరకు గంగానది పుష్కరాలు నిర్వహిస్తారు.భారతీయులకు అత్యంత పవిత్రమైనది గంగానది. స్వర్గ లోకంలో ఉండే మందాకినిని భగీరధుడు తన తపస్సుతో నేలకు రప్పించాడని చెబుతారు. మూడు లోకాల్లోనూ ప్రవహించే కారణంగా గంగను త్రిపథగ అని పిలుస్తారు. గంగానది పుట్టిన గంగోత్రి, హరిద్వార్, వారణాశి వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో గంగానది పుష్కర విధులను ఆచరించవచ్చు. పుష్కరాల సమయంలో పితృదేవతలకు శ్రాద్ధవిధులు నిర్వహిస్తారు. పుష్కర స్నానం, దానం అత్యంత పుణ్యప్రదాలు.
“గంగానది ప్రధాన పుష్కర్ ఘాట్లు వాటి పేర్లు”

- Advertisement -
  1. వారణాసి, 2. గంగోత్రి, 3. హరిద్వార్, 4. బద్రీనాథ్
  2. కేదార్నాథ్, 6. ప్రయాగ
  3. అలహాబాద్
    వారణాసిలో గంగా పుష్కర స్నానానికి 64 స్నాన ఘాట్‌లు ఉన్నాయి. అన్నింటిలో మణికర్ణికా ఘాట్ ముఖ్యమైనది.
    గంగా ఘాట్లలో చేయవలసినవి & చేయకూడనివి:
  4. నది ప్రాంగణాన్ని శుభ్రంగా మరియు చక్కగా ఉంచండి.
  5. పూజ లేదా ఏదైనా వివరాల కోసం నమోదిత పురోహితులను మాత్రమే సంప్రదించండి.
  6. క్యూ పద్ధతిని అనుసరించండి.
  7. నదిలో వ్యర్థ పదార్థాల ద్వారా వెళ్లవద్దు.
  8. ఘాట్లో స్నానానికి సబ్బులు, షాంపూలు ఉపయోగించవద్దు.
  9. నాణేలు, ఇతర వస్తువులను నదిలో వేయవద్దు.
  10. ప్లాస్టిక్ వ్యర్థాలు, వైద్య వ్యర్థాలతో నదిని కలుషితం చేయవద్దు.

ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయో తెలుసుకుందాం.

  1. మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగానది పుష్కరాలు
  2. వృషభ రాశి యందు ప్రవేశించినప్పుడు నర్మదా నది పుష్కరము,
  3. మిథున రాశి యందు గురుడున్నచో సరస్వతీ నదికి పుష్కరాలు,
  4. కర్కాటక రాశి యందున్న యమునా నదికి,
  5. సింహరాశి యందున్న గోదావరి నదికి,
  6. కన్యారాశి యందున్న కృష్ణానదికి,
  7. తుల యందున్న కావేరీ నదికి,
  8. వృశ్చిక రాశి యందున్న భీమరథీ నదికి,
  9. ధనూరాశి యందున్న పుష్కర నదికి,
  10. మకరమందున్న తుంగభద్రా నదికి,
  11. కుంభ మందు సింధునదికి,
  12. మీన రాశి యందు ప్రణీత నదికి పుష్కరాలు వస్తాయి.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News