Saturday, July 27, 2024
HomeదైవంGarla: పంచలోహ విగ్రహాల బహూకరణ

Garla: పంచలోహ విగ్రహాల బహూకరణ

తూర్పు ఆంజనేయస్వామి ఆలయానికి ..

శ్రీరామ నవమి వేడుకల్లో సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపించేందుకు శాశ్వతంగా దేవాలయానికి పంచలోహ విగ్రహాలను అందజేయడం సంతోషకరమని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ వర్తక ప్రముఖులు రమేష్ బాబు అన్నారు. గార్ల మండల కేంద్రంలోని స్థానిక తూర్పు ఆంజనేయ స్వామి దేవాలయానికి గార్ల పట్టణ వర్తక ప్రముఖులు అత్తులూరి సత్యం- రమాదేవి దంపతులు గురువారం సుమారు, 81 వేల విలువైన 29 కేజీల బరువు గల సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహలను అర్చకులు చిదంబరంకు అందజేశారు.

- Advertisement -

ఈ విగ్రహాలకు ఆలయ అర్చకులు జల, పుష్ప, పంచామృతాలతో అభిషేకాలు జరిపి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యం రమాదేవి దంపతులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ఆలయంలో గతంలో ఉత్సవ విగ్రహాలు ఉండగా వాటి స్థానంలో నేడు పంచలోహ విగ్రహలను బహూకరించినట్టు వర్తక సంఘం భవనంలో ఇక ప్రతి సంవత్సరం ఈ పంచలోహ విగ్రహాలతోనే సీతారాముల కళ్యాణం నిర్వహిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో వర్తక ప్రముకులు కందునూరి ఉపేందర్ రాంబాబు, శ్రీనివాసరావు, జక్కుల పాండు రంగారావు, వేమి శేట్టి శ్రీనివాసరావు విద్యాసాగర్, రంగారావు, సక్రు బాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News