గార్ల మండల పరిధిలోని గోపాలపురం గ్రామంలో ఈనెల25నుండి 27వ తారీకు వరకు నిర్వహించే శీతల పరమేశ్వరి బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి ఆంజనేయ స్వామి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవాలయాలలో జీవద్వజ స్తంభ ప్రతిష్టాప మహోత్సవం దేవస్థానం కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సోమవారం ఉదయం విగ్రహాల ఊరేగింపు శోభయాత్ర పూజ అగ్ని ప్రతిష్ట హోమాములతో ఘనంగా ప్రారంభించారు.
ఈనెల25 నుండి 27వ తారీకు వరకు గ్రామంలో పూజా కార్యక్రమాలు హోమాలు బ్రహ్మశ్రీ వేద పండితులు చల్లా శ్రీరామ శాస్త్రి ఆధ్వర్యంలో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణల మధ్య బొడ్రాయి నాభిషీల ప్రతిష్ట గ్రామంలోని ఆంజనేయ స్వామి తిరుపతమ్మ ముత్యాలమ్మ ఆలయాలలో జీవద్వజ ప్రతిష్టాపన మహోత్సవం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా విగ్నేశ్వర పూజ గ్రామ బలిహరణ జలాధివాసం నీటి అభిషేకం మహిళలచే సామూహిక కుంకుమార్చన ధాన్యాధివాసం పుష్పాదివాసం శయ్యాధి వాసం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం వివిధ దేవత ఆలయాలలో జీవద్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమాలతో పాటు పూర్ణాహుతి ప్రతిష్టాపన కార్యక్రమాలు గోపాలపురం దేవస్థానం కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించనున్నారు.
గ్రామంలోని వివిధ ఆలయాలలో పూర్వకల ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని గ్రామస్తులు కోరారు.