గుంతకల్ మండలంలోని నాగసముద్రం గ్రామంలో ఉదయం శ్రీ కదిరి నరసింహ స్వామి కళ్యాణ రథోత్సవము వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఉచిత సామూహిక వివాహాలను సింగంశెట్టి విశ్వనాధయ్య దంపతుల చేతుల మీదుగా 10 జంటలు ఒకటయ్యాయి.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిరణ్ కుమార్ గౌడ్ పద్మావతమ్మ గ్రామ పురోహితులు సూర్యనారాయణశర్మ భాను తేజ శర్మ కల్యాణాన్ని నిర్వహించారు. సాయంత్రం రథోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామ పెద్దలు, గ్రామ సర్పంచి నరసింహులు సింగంశెట్టి సీతారామయ్య దేవాలయ అర్చకులు పెద్ద కదిరప్ప చిన్న కదిరప్ప జయసింహ నారాయణస్వామి గుమ్మనూరు జయరాం సోదరులు శ్రీనివాస్ సామూహిక ఉచిత వివాహాలకు, రథోత్సవానికి హాజరయ్యారు. గ్రామ ప్రజలు బంధుమిత్రులకు సహకరించిన భక్తులందరికీ సింగంశెట్టి విశ్వనాధయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.