Jupiter and Moon Conjunction 2025: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను మారుస్తాయి. జూలై 22న చంద్రుడు మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే అదే రాశిలో దేవగురు బృహస్పతి సంచరిస్తున్నాడు. మిథునరాశిలో గురు, చంద్రుల కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం రూపొందుతోంది. దీనిని చాలా శక్తివంతమైన యోగంగా భావిస్తారు. ఈ యోగ ప్రభావం చేత మూడు రాశులవారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహ రాశి
గజకేసరి రాజయోగం సింహరాశి వారికి ఆర్థికంగా లాభాలను ఇస్తుంది. మీ బిజినెస్ భారీగా విస్తరిస్తారు. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కళల రంగంలో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. మీకు రుణం లభిస్తుంది. అదృష్టం మీ వెన్నంటే ఉండటంతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. జాబ్ చేసేవారికి ప్రమోషన్ లభించే సూచనలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి
పవర్ పుల్ గజకేసరి రాజయోగం మిథునరాశి యెుక్క లగ్నంలో ఏర్పడుతోంది. దీంతో అవిహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో రొమాన్స్ ఉంటుంది. మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు. సమాజంలో గౌరవం మరియు హోదా పెరుగుతాయి. మీ యెుక్క కష్టాలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులు, వ్యాపారాలు మంచి లాభాలను పొందుతారు.
కన్యారాశి
కన్యా రాశి యెుక్క పదవ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ట్రై చేసేవారికి అవకాశాలు వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. విద్యార్థులకు ఈసమయం అనుకూలంగా ఉంటుంది. రైటింగ్, టీచింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తులు లాభపడతారు. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. సంతాన యోగం ఉంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. తెలుగు ప్రభ దీన్ని ధృవీకరించలేదు.


