Sunday, November 16, 2025
HomeదైవంGuru Purnima 2025: గురు పూర్ణిమ నాడు అరుదైన యాదృచ్చికం.. ఇది ఎవరికి లాభం? ఎవరికి...

Guru Purnima 2025: గురు పూర్ణిమ నాడు అరుదైన యాదృచ్చికం.. ఇది ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Buck Moon 2025 Effect on Zodiacs: ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమినే ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అని పిలుస్తారు. ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఇవాళ(జూలై 10) జరుపుకోనున్నారు. ఇది ఆధ్యాత్మిక పరంగా, ఖగోళ శాస్త్రపరంగా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ సారి ఏర్పడబోయే పౌర్ణమిని ‘బక్ మూన్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు జూలై నెలలో ఉత్తర అమెరికాలో జింకల(బక్స్) కొమ్ములు పెరుగుతాయని కొన్ని తెగల వారు నమ్ముతారు.

- Advertisement -

భారతదేశంలో ఈ రోజు చంద్ర దర్శనానికే మాత్రమే పరిమితం కాదు. బౌద్ధ సంప్రదాయంతో కూడా ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ పౌర్ణమి నాడు బుద్ధుడు సారనాథ్‌లోని జింకల ఉద్యానవనంలో తన మెుదటి ఉపన్యాసాన్ని ఇచ్చాడు. దీనినే ధర్మచక్ర పరివర్తన అని అంటారు. జ్యోతిష్యశాస్త్రపరంగా ఈసారి పౌర్ణమి మకరరాశి రెండో దశలో ఏర్పడబోతుంది. దీని ప్రభావం మెుత్తం 12 రాశిచక్రాలపై విభిన్నంగా ఉంటుంది. అయితే ఈ గురు పౌర్ణమి ఏయే రాశులవారికి అనుకూలంగా ఉంటుందో, ఎవరికీ ప్రతికూలంగా ఉంటుందో తెలుసుకుందాం.

రాశిచక్ర గుర్తులపై ప్రభావం
మేష రాశి: కెరీర్‌లో గెలుపు, స్థాన మార్పుకు అవకాశం
వృషభం: ఆధ్యాత్మికపై మక్కువ మరియు కెరీర్‌లో కొత్త దిశ
మిథునం: బంధువులకు పరీక్షా కాలం, ఆర్థిక పరిస్థితిపై దృష్టి
కర్కాటకం: సంబంధాలు బలపడటం, వివాహం లేదా పిల్లల అవకాశం
సింహరాశి: ఆరోగ్యం మరియు జీవనశైలిలో మార్పులు
కన్య: పని పట్ల సంతృప్తి, ఎమోషన్స్ కంట్రోల్
తుల: కుటుంబ సభ్యుల మధ్య బంధం మరింత గట్టిపడుతుంది.
వృశ్చికం: కెరీర్ మరియు కమ్యూనికేషన్‌ పరంగా బాగుంటుంది
ధనుస్సు: కొత్త ఆదాయ వనరులు, మీ విలువను మీరు గుర్తిస్తారు.
మకరం: కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, మీ విలువ తెలిసి వస్తుంది.
కుంభం: మానసిక స్థితి మెరుగుపడుతుంది, కెరీర్ లో మార్పుకు అవకాశం
మీనం: మీరు అనుకున్న గమ్యం వైపు అడుగులు వేస్తారు, విజయం సాధిస్తారు కూడా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad