Benefits of Hamsa Maha Purusha Yoga: ఆస్ట్రాలజీలో ప్రతి యోగానికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు కాలానుగుణంగా రాశులను మార్చడం ద్వారా పవర్ పుల్ రాజయోగాలను ఏర్పరుస్తాయి. అలాంటి వాటిలో హంస మహాపురుష రాజయోగం ఒకటి. ప్రస్తుతం ఈ అరుదైన యోగాన్ని దేవగురు బృహస్పతి ఏర్పరుస్తున్నాడు. ఇది దాదాపు పుష్కర కాలం తర్వాత దసరా పండుగ సమయంలో సంభవిచంబోతుంది. ఈ శక్తివంతమైన యోగ ప్రభావం కారణంగా కొందరి అదృష్టం మారబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి
హంస మహాపురుష రాజయోగం మిథునరాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు ఊహించని ధనలాభాలను ఇస్తాయి. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తుల లాభాలు విపరీతంగా పెరుగుతాయి. మీకు అదృష్టంతోపాటు ఐశ్వర్యం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలకు ఈ టైం కలిసి వస్తుంది. మీరు కుటుంబ భాందవ్యాలకు విలువనిస్తారు.
కన్యా రాశి
అక్టోబరులో గురుడు సృష్టించబోతున్న హంస మహాపురుష రాజయోగం కన్యారాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. రాబోయే కొన్ని నెలలపాటు ఈ రాశివారు ఎన్నో లాభాలను పొందబోతున్నారు. మీరు కార్య సాధనలో సఫలత సాధిస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగ ప్రమోషన్ రానే వస్తుంది. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు ఎన్నడూ చూడని లాభాలను తెచ్చిపెడతాయి.
Also Read: Budh vakri 2025- వక్రంలో బుధుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..
వృశ్చిక రాశి
దసరా సమయంలో బృహస్పతి చేయబోతున్న శక్తివంతమైన యోగం వృశ్చికరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వివాహయోగం ఉంది. నూతన దంపతులకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతభత్యాలు పెరగడంతోపాటు పదోన్నతి పొందే అవకాశం ఉంది. మీ కెరీర్ లో మంచి పురోగతి కనిపిస్తుంది.


