Friday, March 28, 2025
Homeదైవంఇంట్లో జెర్రి కనిపిస్తే శుభమా..? అశుభమా..? జ్యోతిష్య నిపుణుల ఏమంటున్నారంటే..!

ఇంట్లో జెర్రి కనిపిస్తే శుభమా..? అశుభమా..? జ్యోతిష్య నిపుణుల ఏమంటున్నారంటే..!

భారతీయ సంస్కృతిలో ప్రతిచోటా ఆచారాలు, నమ్మకాలు ఒక ప్రధాన భాగంగా ఉంటాయి. హిందూ సంప్రదాయంలో ప్రతి చిన్న ఘటనకూ ఏదో ఒక అర్థం ఉంటుందని నమ్ముతారు. ప్రాచీన కాలం నుంచి మన పెద్దలు జీవులు, పక్షులు, నలుగురు చెప్పిన మాటలు అన్నింటినీ సంకేతాలుగా భావిస్తూ వచ్చారు. వాస్తు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు ఈ నమ్మకాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. కొన్ని జంతువులు, పక్షులు శుభప్రదంగా మారితే, మరికొన్ని ప్రతికూల శక్తికి సూచనగా భావిస్తారు.

- Advertisement -

అదే విధంగా జెర్రి గురించి కూడా అనేక విశ్వాసాలు ఉన్నాయి. చాలామంది జెర్రిని చూసిన వెంటనే భయపడతారు, కొందరు దీన్ని అశుభసూచకంగా భావిస్తారు.. మరికొందరు దీన్ని ధనలాభానికి, శుభవార్తలకు సంకేతంగా భావిస్తారు. ఇంట్లో జెర్రి కనిపిస్తే నిజంగా అదృష్టమా..? దురదృష్టమా..? ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంట్లో జెర్రి కనిపిస్తే దాని అర్థం ఏమిటి:
జ్యోతిష్యం ప్రకారం, జెర్రిని రాహువు గ్రహానికి చిహ్నంగా భావిస్తారు. రాహువు అనేది ఛాయాగ్రహం. ఇది సమతుల్యం లేకపోతే వ్యక్తి జీవితంలో ఆటంకాలు, అనారోగ్యం, సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంట్లో జెర్రి కనిపించడం వాస్తు దోషాన్ని సూచించవచ్చు. ఇది ఇంట్లో ప్రతికూల శక్తి చేరినట్టు సంకేతం కావచ్చు అంటారు. అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే కొంతమంది జ్యోతిష్య పండితులు మాత్రం భిన్నంగా అంటున్నారు. కొన్ని సందర్భాల్లో, ఇంట్లో జెర్రి కనిపించడం ధనలాభానికి, శ్రేయస్సుకు సూచన కావచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా, ఆకస్మిక ధనలాభం, కొత్త అవకాశాలు, ఉద్యోగ ప్రాప్తి వంటి శుభవార్తలకు ఇది సంకేతమని చెబుతారు.

ఇంట్లో జెర్రి కనిపిస్తే, దాన్ని అశుభంగా భావించాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే, ఇవి వర్షాకాలంలో నీటి చేరిక వల్ల కొత్త చోట్లకు వెళతాయి. జ్యోతిష్యపరంగా చూస్తే, కొన్ని సందర్భాల్లో శుభ సూచన, మరికొన్ని సందర్భాల్లో ప్రతికూల సంకేతంగా భావించొచ్చు. అయితే ఇంట్లో జెర్రిలు నివసించకుండా కాపాడుకోవడం, వాస్తు దోషాలను నివారించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని న్యూస్ తెలుగు ప్రభ.. ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News