Tuesday, February 11, 2025
HomeదైవంJadcharla: ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

Jadcharla: ప్రారంభమైన వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

జాతరు పోటెత్తిన జనాలు

జడ్చర్ల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలుప్రారంభమయ్యింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. వేడుకల్లో నిత్య పూజలతో పాటు ద్వజారోహణం జరిపించారు. రాత్రికి పూల తేరును లాగారు. కళ్యాణోత్సవం సందర్భంగా పట్టణానికి చెందిన గంట మోహన్ రెడ్డి దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 8 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. జాతర కోసం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఏటా అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నారు. వందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మండలంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. బ్రహ్మోత్సవాలకు ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు.

- Advertisement -

పున్నమి నాటి రథోత్సవం

బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫిబ్రవరి 12న బుధవారం పౌర్ణమి పురస్కరించుకొని రథోత్సవము (పెద్దతేరు), 13న గురువారం శకటోత్సవం (ఎడ్ల బండ్లు), 14న శుక్రవారం గరుడ వాహన సేవ, 15న శనివారం గజవాహన సేవ, 16 ఆదివారం శేష వాహన సేవ, 18 మంగళవారం గరుడ శేష వాహనములపై స్వామి వారి ఊరేగింపు, చక్ర తీర్థ అమృత స్నానము, జాతర బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News