Jupiter Transit August 2025: దేవగురు బృహస్పతి ఆగస్టులో రెండుసార్లు సంచారం చేయబోతుంది. ఈ మార్పు కొన్ని రాశులవారిని అదృష్ట వంతులను చేయనుంది.కెరీర్ లో పురోగతి, వ్యాపారంలో లాభాలు, సమాజంలో గౌరవం, జీవితంలో స్థిరత్వం వంటి మార్పులను చూడవచ్చు. గురుడు సంచారం వల్ల కొందరికి విదేశీ యోగం కూడా ఉంది. మెుత్తానికి బృహస్పతి గోచారం మేష, కర్కాటకం, మీనరాశుల వారికి శుభప్రదంగా ఉండబోతుంది.
మేషరాశి
ఆగస్టులో బృహస్పతి యొక్క ద్విసంచారం మేష రాశి వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురాబోతుంది. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకుంటారు, ఇది భవిష్యత్తులో మంచి లాభాలను ఇస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. కెరీర్ లో ఎన్నడూ చూడని పురోగతి ఉంటుంది. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులు విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల మధ్య బంధం మరింత ధృడపడుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో మీపై ఆదరణ పెరుగుతుంది. మీరు ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.
మీన రాశి
మీన రాశి అధిపతి బృహస్పతి, కాబట్టి గురుడు ద్వంద్వ సంచార ప్రభావం మీకు శుభఫలితాలను ఇస్తుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ఎదురుచూసేవారి కోరిక సిద్ధిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. ఆర్థిక స్థితి బలపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. జీవితంలో పురోగతి, స్థిరత్వం ఉంటుంది.
Also Read: Gajalakshmi Raja Yoga- వినాయక చవితికి ముందు సుడి తిరగబోతున్న రాశులివే..!
కర్కాటక రాశి
గురు గ్రహం యొక్క నక్షత్ర మార్పు ప్రభావం కర్కాటక రాశి వారికి చాలా సానుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు కొత్త భాగస్వాములతో పనిచేయడం వల్ల ఊహించని ప్రయోజనాలను పొందుతారు. పాతపెట్టుబడుల నుంచి మంచి ఆదాయం వస్తుంది. పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుంది. మీ కెరీర్ లో వృద్ధి ఉంటుంది. అదృష్టం కూడా ఎల్లప్పుడూ మీకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేస్తారు.


