ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాల్సిందిగా సీఎం జగన్ ను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించారు పూతలపట్టు ఎమ్మెల్యే యం.యస్.బాబు, దేవస్ధానం ధర్మకర్తల మండలి ఛైర్మన్ అగరం మోహన్ రెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్. ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు వినాయక స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేసిన ఎమ్మెల్యే, ఆలయ ఛైర్మన్, ఈవో. అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఈ నెల 18 నుంచి అక్టోబర్ 8 వరకు 21 రోజుల పాటు చిత్తూరు జిల్లా కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు.