Sunday, July 7, 2024
HomeదైవంKarimnagar: శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

Karimnagar: శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణం

అంగరంగ వైభవంగా కల్యాణోత్సవం

అంగరంగ వైభావంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమెత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. అమ్మవారి తరపున రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్వామి వారి తరుపున ఆలయ ఈ.ఓ ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ చకిలం శ్రీనివాస్ లు వేడుకలో పాల్గొన్నారు. వేద పురోహితుల మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య సుముహూర్త ఘడియల్లో కళ్యాణ దాన కార్యక్రమంతో పాటు శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం వేలాది మంది భక్తుల కన్నులు వేచి చూస్తుండగా సమస్త దేవతలను సమాయత్త పరిచే వేద మంత్రాల మధ్య కన్నుల పండువగా జరిగింది. లక్ష్మీ నారాయణ ధ్యానంతో, గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి, వేద పండితులు కళ్యాణం యొక్క విశిష్టతను భక్తులకు వివరించారు.

- Advertisement -


మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు, అదిష్ నల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ దంపతులు, బాలయ్య ఈవో, చైర్మన్ దంపతులు వదూవరులకు అలంకరించే నృత్యాలు చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాటు చేసిన అన్న ప్రసాదంతో పాటు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు అందజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News