Grah Gochar in September 2025: ఆధ్యాత్మికంగా, గ్రహాల సంచార పరంగా సెప్టెంబరు మాసం చాలా ముఖ్యమైనది. ఈ నెల 13న కుజుడు తులారాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించనున్నాడు. సెప్టెంబరు 15న శుక్రుడు సింహరాశిలోకి, అదే రోజు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ గ్రహాల సంచారం వల్ల కొన్ని రాశులవారి అదృష్టం మారబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
ధనస్సు రాశి
సెప్టెంబరు నెల ధనస్సు రాశి వారి అదృష్టాన్ని తిరగరాయనుంది. గ్రహాల సంచారం వల్ల దసరా లోపు ధనస్సు రాశి వారు ధనవంతులు కానున్నారు. భూములు కొనుగోలు చేస్తారు. మీ సంసార జీవితం బాగుంటుంది. వ్యాపారం విస్తరిస్తుంది. జీవితంలో ఆనంద వెల్లివిరుస్తుంది. మీ కెరీర్ ఊహించని మలుపు తిరుగుతుంది. వివాహం కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఆగిపోయిన పనులన్నీ మెుదలవుతాయి.
వృషభరాశి
సెప్టెంబరు నెల వృషభరాశి వారికి అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇవ్వబోతుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటారు. సంతానం లేదా ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో ఊహించని లాభాలు ఉంటాయి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సక్సెస్ అవుతారు. లక్ కలిసి వచ్చి మీరు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి.
Also Read: Venus Transit 2025 -నవరాత్రులకు ముందు శుక్రుడు సంచారం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారం..
సింహరాశి
సింహరాశి వారికి ఈ నెల శుభప్రదంగా ఉండబోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. హెల్తీగా ఉంటారు. మీరు చేయాలనుకున్న పనులు సమయానుగుణంగా జరుగుతాయి. వివాహ ప్రాప్తి ఉంది. పిల్లలు కోసం ఎదురుచూసే వారి కోరికలు నెరవేరుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలన్న మీ కోరిక నెరవేరుతుంది. గతంలో ఇచ్చిన ధనం మీ చేతికి తిరిగి వస్తుంది. బిజినెస్ చేసేవారు ఎన్నడూ లేని విధంగా లాభపడతారు. పెట్టుబడులు రాబడులను ఇస్తాయి.
Disclaimer: పైన ఇచ్చిన కథనం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనిని జ్యోతిష్య నిపుణుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా రూపొందించడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


