Sunday, November 16, 2025
HomeదైవంVastu: మీ ఇంట్లో బల్లి ఉందా..అది మంచి శకునమా..చెడు శకునమా..!

Vastu: మీ ఇంట్లో బల్లి ఉందా..అది మంచి శకునమా..చెడు శకునమా..!

Vastu-Spiritual:మన ఇంట్లో బొద్దింకలు, దోమలు, కందిరీగలు లాంటి చిన్న పురుగులు సహజంగానే కనిపిస్తాయి. వీటితో పాటు బల్లులు కూడా తరచుగా కనిపించడమనేది సాధారణ విషయమే. అయితే చాలామందికి బల్లులు అంటే భయం, చిరాకు. అవి కనిపించగానే తరిమేస్తారు. ఇంకొందరికి మాత్రం వాటిని చూసినా వదిలేస్తారు. బల్లుల గురించి పూర్వకాలం నుండి అనేక నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దాన్ని శుభ సూచికంగా భావిస్తే, మరికొందరికి అది చెడుకి సంకేతంగా భావిస్తారు.

- Advertisement -

బల్లికి ప్రత్యేక ప్రాధాన్యం..

జ్యోతిష్యం,వాస్తు శాస్త్రంలో బల్లికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు, కుటుంబ సౌభాగ్యం విషయంలో బల్లి కనిపించడం శకునాలుగా పరిగణిస్తారు. ఉదాహరణకు, కొత్త ఇంటి గృహప్రవేశం లేదా వాస్తు పూజ సమయంలో వెండి బల్లి విగ్రహాలను ఉపయోగించడం సంప్రదాయంగా కొనసాగుతోంది. దీని వెనుక కారణం, బల్లి సంపదను ఆకర్షించే సూచికగా భావించటమే.

పూజ గదిలో బల్లి..

ఇంట్లో పూజ గదిలో బల్లి కనబడితే అది చాలా శుభంగా భావిస్తారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, పూజ స్థలంలో బల్లి కనిపించడం అంటే ఇంటికి ధనలాభాలు రాబోతున్న సంకేతం అని చెబుతారు. భవిష్యత్తులో కొత్త ఆర్థిక అవకాశాలు కలుగుతాయని కూడా ఇది సూచిస్తుంది.

దీపావళి పండుగ రోజున..

దీపావళి పండుగ రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే, ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని నమ్మకం ఉంది. ఈ విశ్వాసం కారణంగా చాలా కుటుంబాలు బల్లిని హాని చేయకుండా వదిలేస్తుంటారు. బల్లి ఇంట్లో ఉండడం శుభప్రదమని భావించడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం. అది సంపద, సంతోషానికి సంకేతమనే నమ్మకం.

పోట్లాడుకుంటూ కనిపిస్తే..

అయితే, ప్రతి సందర్భంలో బల్లి శుభమే అని చెప్పలేమని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు, రెండు బల్లులు ఒకేసారి కనిపిస్తే దానికి ప్రత్యేక అర్థం లేదని అంటారు. అది శుభమా అశుభమా అనే భావనతో సంబంధం లేకుండా సాధారణం అని మాత్రమే చెబుతున్నారు. కానీ, రెండు బల్లులు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ కనిపిస్తే మాత్రం అది అనుకూలం కాదని వివరిస్తున్నారు. అలాంటి దృశ్యం కుటుంబంలో కలహాలు లేదా అనారోగ్య సమస్యలు రావచ్చని సూచనగా పరిగణిస్తారు.

నడుస్తూ కనబడితే..

అలాగే, బల్లి నేలమీద నడుస్తూ కనబడితే దాన్ని కూడా శుభ సూచనంగానే పరిగణిస్తారు. ఇది కొత్త పనులు సాఫీగా జరగబోతున్న సంకేతం అని విశ్వసిస్తారు. అందువల్ల బల్లికి హాని చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. బల్లి ప్రాణానికి హాని కలిగితే ఆ ఇంటికి అశుభం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/navratri-auspicious-items-to-bring-home-and-things-to-avoid/

బల్లికి సంబంధించిన ఈ నమ్మకాలు అన్నీ శాస్త్రీయ ఆధారాలపై కాకుండా పూర్వకాలపు అనుభవాలు, విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయని చెబుతారు. అయినప్పటికీ, ఇంట్లో బల్లి కనిపించడం వెనుక పాజిటివ్ భావన ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థిక ప్రగతి, సుఖసంపద, లక్ష్మీదేవి అనుగ్రహం వంటి అంశాల్లో బల్లి శుభప్రదంగా పరిగణిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad