మహానంది క్షేత్రంలో హుండీ లెక్కింపు కానుకల ద్వారా శ్రీ మహానందీశ్వర స్వామివారికి రూ.77,64,241 ఆదాయం వచ్చిందని మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ గురువారం దేవస్థానం అభిషేకం మండపంలో శ్రీ మహానందీశ్వర స్వామి, శ్రీ కామేశ్వరి అమ్మవారు హుండీ, ఉభయ దేవాలయాల ఉండి లెక్కింపు నిర్వహించగా 71 రోజులకు హుండీ కానుకల ద్వారా రూ.75,97,586, అన్న ప్రసాదం ద్వారా రూ.1,27,229, గో సంరక్షణ ద్వారా రూ.39,426 ,మొత్తం రూ.77,64,241 ఆదాయం వచ్చిందన్నారు.
కానుకలతో పాటు యూఎస్ఏ 1 డాలర్ -5 ,ఎన్ ఓ ఎస్,10 యూరో -2,ఆస్ట్రేలియా 5 డాలర్ 1 వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా తరుపున వెలుగోడు గ్రూప్ దేవాలయముల ఈఓ జనార్ధన, దేవస్థానం ఏఈఓ వై.మధు, పర్యవేక్షకులు ఓంకారం వేంకటేశ్వర్లు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు బి.నాగ భూషణం, డి.రంగన్న,ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, పలు గ్రామాల నుండి విచ్చేసిన భ్రమరాంబిక సేవా, చీరాల, సమితి సేవకులు, శ్రీ తిరుమల బాలాజీ సేవా సమితి, కర్నూల్ బాలాజీ సేవా ట్రస్ట్, కర్నూల్ సేవకులు పాల్గొన్నారు.