Thursday, July 4, 2024
HomeదైవంMahanandi: 33 రోజుల్లో 38 లక్షల ఆదాయం

Mahanandi: 33 రోజుల్లో 38 లక్షల ఆదాయం

మహానందీశ్వరుని హుండీ లెక్కింపు..

మహానంది పుణ్యక్షేత్రంలో ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించగా దేవస్థానానికి రూ.38,37,413 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన ఆలయాల్లో భక్తులు 33 రోజుల పాటు సమర్పించిన హుండీ కానుకలను ఆలయ ప్రాంగణంలోని అభిషేక మండపంలో సిబ్బందితో లెక్కించామన్నారు.

- Advertisement -

ఈ హుండీ లెక్కింపులో స్వామి, అమ్మవారి ఆలయాలలోని హుండీలతో పాటు ఇతర హుండీలను లెక్కింపు నిర్వహించగా రూ.38,37,413 ఆదాయం వచ్చిందన్నారు. ఉభయ ఆలయాల ద్వారా రూ.37,86,188, అన్న ప్రసాదం హుండీ ద్వారా రూ.33,325, గోసంరక్షణ ద్వారా రూ.17,900, మొత్తం రూ.38,37,413 ఆదాయం వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా తరుపున వెలుగోడు గ్రూప్ దేవాలయముల కార్యనిర్వహాణాధికారి వి. జనార్ధన, మహానంది దేవస్థానం ఏఈఓలు మధు, ఓ. వేంకటేశ్వరుడు ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, శ్రీ తిరుమల బాలాజీ సేవా సమితి, బాలాజీ సేవా ట్రస్ట్, కర్నూల్ సేవకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News