Sunday, July 7, 2024
HomeదైవంMahanandi: వైభవంగా మహానందీశ్వరుని పల్లకి సేవ

Mahanandi: వైభవంగా మహానందీశ్వరుని పల్లకి సేవ

శాస్త్రోక్తంగా సాగిన సేవ

మహానంది పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామివారికి శుక్రవారం శివుని జన్మనక్షత్రం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ముందుగా స్వామీ అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయ వేద పండితులు, అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పల్లకిలో కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో వైభవంగా పల్లకి సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News