Friday, April 4, 2025
HomeదైవంMantralayam: భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం

Mantralayam: భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తుల తో గురువారం కిక్కిరిసింది. రాఘవేంద్ర స్వామి దర్శనర్థం కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రామ దేవత మంచలమ్మ, రాఘవేంద్ర స్వామి మూల బృందావనం దర్శనానికి వేకువ జాము నుంచే వరసకట్టారు. లైన్లో నిలిచిన భక్తుల దర్శనం పూర్తి చేసుకొని తిరిగి బయటకు రావడానికి రెండు గంటలు పడుతుంది.

- Advertisement -

రాఘవేంద్ర స్వామి బృందావనానికి భక్తులు అభిషేకం, అలంకరణ, మంగళ హారతి, బంగారు పల్లకీ తదితర సేవలు చేయించి మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో తరలిరావడం తో మఠం పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులను ఫల మంత్రక్షితలు ఇచ్చి పీఠాధిపతి సుభుదెంద్ర తీర్థులు ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News