Monday, November 25, 2024
HomeదైవంMantralayam: వైభవంగా రాఘవేంద్ర స్వామి పాదుకల పట్టాభిషేకం

Mantralayam: వైభవంగా రాఘవేంద్ర స్వామి పాదుకల పట్టాభిషేకం

బంగారు రథంపై పాదుకల ఊరేగింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు అధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి పాదుకల పట్టాభిషేకం మహోత్సవం వైభవంగా జరిగింది. గురు వైభవోత్సవాలు రెండో రోజులుగా కనులపండువగా సాగుతున్నాయి.

- Advertisement -

రాఘవేంద్ర స్వామి నామస్మరణ.. వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య బంగారు సింహాసనంపై కొలువు తీరిన రాఘవేంద్ర స్వామి బంగారు పాదుకలకు జలాభిషేకం, ముత్యాలు, పుష్పాలతో అభిషేకం చేశారు.

మంగళ హారతులు ఇచ్చి పాదుకలను పీఠాధిపతి తలపై, హృదయానికి, కళ్ళకు హత్తుకొని భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఇతర భాషల్లో ముద్రించిన పుస్తకాలు, గ్రంథాలను అవిష్కరించారు. రాఘవేంద్ర స్వామి పాదుకలను బంగారు రథంపై ఉంచి మధ్య ప్రాకారంలో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు.

సాయంత్రం కళావేదికపై ప్రముఖ నృత్యకరులు, సంగీత విద్వాంసులు సాంస్కృతిక కళాప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు ఏఏఓ మధవసెట్టీ, మేనేజర్లు ఎస్ కే శ్రీనివాసు రావు, వెంకటేష్ జోషి, పీఆర్ ఓఐ పి నరసింహమూర్తి, శ్రీపతి ఆచర్, సురేష్ కోనపుర్, భద్రి, వ్యసరాజచర్, బిందు మాధవ్, జయతీర్థా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News