Tuesday, September 17, 2024
HomeదైవంMedaram offerings online: ఆన్లైన్లో మేడారం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం

Medaram offerings online: ఆన్లైన్లో మేడారం అమ్మవార్లకు నిలువెత్తు బంగారం

ఇంటికే సమ్మక్క సారలమ్మ ప్రసాదం

పలు కారణాలతో మేడారం వెళ్లలేని భక్తులు అమ్మవార్లకు సమర్పించే నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ ద్వారా అమ్మవార్లకు సమర్పించే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ప్రకటించారు. తెలంగాణ సమాజం మహిమాన్విత శక్తులుగా కొలిచే శ్రీ సమ్మక్క సారక్కల గద్దెల వద్ద నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించడాన్ని భక్తులు ఎంతో పవిత్రమైన కార్యంగా భావిస్తారని తెలిపారు. జాతరకు వెళ్ళలేని భక్తులు తమ నిలువెత్తు బంగారాన్ని అమ్మవారి గద్దెల వద్ద సమర్పించే సేవలను సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి ప్రారంభించారు.

- Advertisement -

తన మనవడు కొండా మురళీకృష్ణ పేరును మీ సేవ వెబ్సైట్ లో నమోదు చేసి బరువు ప్రకారం డబ్బులు చెల్లించి, అమ్మవారి గద్దెల వద్ద నిలువెత్తు బంగారాన్ని సమర్పించే సౌకర్యాన్ని మంత్రి సురేఖ పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటి శాఖ సహకారంతో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న ఈ సేవలు బుధవారం నుండి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని, మీ సేవ, టి యాప్ ఫోలియో, పోస్టల్ డిపార్ట్మెంట్ల ద్వారా ఎవరి పేరు మీదైతే బంగారం సమర్పించాలనుకుంటున్నారో వారి బరువును అనుసరించి డబ్బులు చెల్లించి ఈ సేవలను బుక్ చేసుకునే వెసులుబాటును దేవాదాయ శాఖ కల్పిస్తున్నదని అన్నారు.

రాష్ట్రంలోని దాదాపు 5 వేల మీ సేవా సెంటర్లు, దేశంలోని దాదాపు 1.5 లక్షల పోస్టల్ కేంద్రాలు ఈ సేవలను అందిస్తాయని, దేవాదాయ శాఖ సంవత్సరం పొడవునా బంగారం సమర్పణ సేవలను అందిస్తుందని తెలిపారు. బంగారం సమర్పణతో పాటు అమ్మవారి ప్రసాదం కావాలనుకునే వారు కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్, టి యాప్, మీ సేవా కేంద్రాల ద్వారా డబ్బులు చెల్లించినట్లైతే తపాలా శాఖ ద్వారా కొరియర్ ద్వారా వారికి అందుతుందని వివరించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, పోస్టల్ డిపార్ట్ మెంట్, మీ సేవ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News