Sunday, November 16, 2025
HomeదైవంMehreen Kaur Pirzada:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మెహ్రీన్ కౌర్ పిర్జాదా

Mehreen Kaur Pirzada:తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి మెహ్రీన్ కౌర్ పిర్జాదా

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా(Mehreen Kaur Pirzada) దర్శించుకున్నారు. శనివారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. 

- Advertisement -

ఈ నటి కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాతో తెలుగు, సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇప్పటి వరకు 30కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. 2016లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన తక్కువ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిలో మాత్రం నిలిచిపోయారు. అనేక మంది యంగ్ హీరోలతో నటించారు మెహరీన్. f3 తరువాత తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించటం లేదు. కన్నడ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది ఆ సినిమా విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం 52,731 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శన అనంతరం కానుకల రూపంలో హుండీలో శ్రీవారికి రూ.3.24 కోట్ల రూపాయలు చెల్లిచారు. ఇక శనివారం  మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీవారి దర్శనార్థం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 04 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఇక శ్రీవారికి శుక్రవారం నాడు 17,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad