Budh Gochar 2025 in October: ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల రాశి మార్పు మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అక్టోబరులో కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ఇందులో బుధుడి సంచారం ఒకటి. తెలివితేటలు, బిజినెస్ మరియు కమ్యూనికేషన్స్ కు కారకుడిగా బుధ గ్రహాన్ని భావిస్తారు. వచ్చే నెలలో బుధుడు ఉదయించబోతున్నాడు. మెర్క్యూరీ యెుక్క ఈ సంచారం కొన్ని రాశులవారి అదృష్టాన్ని మార్చబోతుంది. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.
తుల రాశి
బుధుడి రాశి మార్పు తులా రాశి వారి కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు బంగారు ఆభరణాలతోపాటు స్థిర చరాస్తులను భారీగా కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మంచి పొజిషన్ కు వెళతారు. వ్యాపారం విస్తరిస్తుంది. కెరీర్ లో ఊహించని స్థాయికి వెళతారు. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారు అనుకోని లాభాలను పొందుతారు.
కుంభ రాశి
బుధుడు సంచారం కుంభరాశి వారి కెరీర్ ను మార్చబోతుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. సెల్ఫ్ కాన్ఫెడెన్స్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను పొందుతారు. వైవాహిక జీవితం బాగుంటుంది. ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది.
Also Read: vastu tips -గోల్డ్ రింగ్ ఏ వేలికి పెట్టుకుంటే మంచి జరుగుతుందో తెలుసా?
మిథున రాశి
బుధుడు ఉదయించడం మిథునరాశి వారికి ఆర్థిక లాభాలను ఇస్తుంది. పైగా ఈ రాశికి బుధుడు అధిపతి కావడం వల్ల మీరు ఊహించని ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారులు కొత్త డీల్స్ ను కుదుర్చుకుంటారు. విద్యార్థులు ఎడ్యుకేషన్ లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఈటైంలో పెట్టే పెట్టుబడులు భారీగా లాభాలను ఇస్తాయి.
కన్యా రాశి
ఈ రాశి వారికి బుధుడు సంచారం సూపర్ గా ఉండబోతుంది. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ రానే వస్తుంది. మీ శాలరీ భారీగా పెరుగుతుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు రాబడిని లభిస్తాయి. వ్యాపారులు అనుకోని లాభాలను పొందుతారు.
Disclaimer: పైన ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, నిపుణుల అభిప్రాయాలను తీసుకుని ఈ వార్తను రూపొందించడమైనది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయత లేదు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


