Chandra Gochar 2025: ఖగోళ శాస్త్రంలో చంద్రుడిని భూమి యెుక్క ఉపగ్రహంగా భావిస్తారు. అయితే జ్యోతిష్యశాస్త్రంలో చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. తల్లి, మనస్సు, భావోద్వేగం, ప్రకృతి, నీరు వంటి ఆంశాలకు చంద్రుడిని కారకుడిగా భావిస్తారు. పంచాంగం ప్రకారం, చంద్ర గ్రహం 18 ఆగస్టు 2025న మధ్యాహ్నం 2:39 గంటలకు మిథునరాశిలోకి ప్రవేశించింది. ఆగస్టు 20 సాయంత్రం 6:34 గంటల వరకు అదే రాశిలో ఉండి తర్వాత కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. చంద్రుడు మిథునరాశి ప్రవేశం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మిథున రాశి
చంద్రుని సంచారం మిథునరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. పెళ్లికానీ ప్రసాదులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. సమాజంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఊహించనంత డబ్బు సంపాదిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ కుటుంబంలో ఆనందం ఉంటుంది.
వృశ్చికం
చంద్రుని సంచారం వృశ్చికరాశి వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. మీరు వ్యాయామంతోపాటు మంచి డైట్ ఫాలోయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు ఓ పెద్ద కంపెనీలో జాబ్ ఆఫర్ వస్తుంది. వ్యాపారవేత్తలు ఊహించని డబ్బును సంపాదిస్తారు. లక్ ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. కెరీర్ లో అందనంత ఎత్తుకు చేరుకుంటారు. డబ్బును భారీగా పొదుపు చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.
Also read: Pithori Amavasya 2025- పిథోరి అమావాస్య ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి?
కన్యా రాశి
కన్యా రాశి వారికి చంద్రుడు సంచారం అద్భుతంగా ఉండబోతుంది. వీరి కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. వ్యాపారంలో అపారమైన లాభాలు ఉంటాయి. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇంట్లోని పెద్ద వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీ ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆఫీసులో మీ బాస్ ప్రశంసలు లభిస్తాయి. నూతన దంపతులకు సంతాన సుఖం కలుగుతుంది.
Also Read: Shukra Gochar 2025 – రేపు కర్కాటకంలోకి శుక్రుడు.. లక్ అంటే ఈ 4 రాశులిదే..
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
.


