వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. తిరుమలతో సహా పలు ప్రముఖ వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తరద్వార దర్శనం చేసుకుని ప్రముఖులు, వీఐపీలు తరిస్తున్నారు. తిరుమలలో 10 రోజులపాటు భక్తులకు ఉత్తరద్వార దర్శనాలు సాగనున్నాయి. ఉత్తరద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. విష్ణువును దర్శనం చేసుకునేందుకు ముక్కోటి దేవతలు ఏకాదశి నాడే వైకుంఠాన్ని చేరుకుంటారు కాబట్టి ఈరోజును ముక్కేటి ఏకాదశి అంటారు. ఇక భక్తులు తమ శక్తి మేర ఈరోజు పూజలు చేసి, ఉపవాసాలు, ఏక భుక్తం వంటివి ఆచరిస్తారు.