Sunday, November 24, 2024
HomeదైవంNaivedyam: ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెట్టాలి ?

Naivedyam: ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెట్టాలి ?

నైవేద్యం అంటే మనం మనసా వాచా కర్మణా మన శక్తికొద్దీ భక్తిపూర్వకంగా దేవుడికి సమర్పించేది. పూజలు, వ్రతాలు, పండగల్లో నైవేద్యం అనేది అతిముఖ్యమైన భాగం. మనం మానసికంగా, శారీరకంగా పరిశుభ్రంగా ఉండి తయారు చేసి అర్పించేదే నైవేద్యం. ఈ నైవేద్యాన్ని మనమంతా ప్రసాదంగా స్వీకరిస్తాం. తిరుపతి లడ్డూ, అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం, అయ్యప్ప ప్రసాదం ఇలా ప్రసాదాలకు చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది.

- Advertisement -

మరి మన ఇంట్లో మనం ఏ దేవుడికి ఏ నైవేద్యాలు పెట్టాలంటే..

1) విఘ్నేశ్వరుడు:-
బెల్లం, ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు నైవేద్యం. శ్వేత (తెల్లని) అక్షతలతో పూజించాలి.
2) శ్రీవేంకటేశ్వరస్వామి:-
వడపప్పు, పానకము, నైవేద్యం పెట్టాలి. తులసిమాల మెడలో ధరింపవలెను.
3) ఆంజనేయస్వామి:-
అప్పములు నైవేద్యం, తమలపాకులతోనూ గంగసింధూరంతోనూ పూజించాలి.
4) లలితాదేవి:-
క్షీరాన్నం, మధురఫలాలు, పులిహోర, మిరియాలు కలిపిన పానకము, వడపప్పు, చలిమిడి, పానకము.
5) సత్యనారాయణస్వామి:-
ఎర్ర గోధుమనూకతో, జీడిపప్పు, కిస్ మిస్, నెయ్యి కలిపి ప్రసాదము నైవేద్యం.
6) దుర్గాదేవి:-
మినపగారెలు, అల్లం ముక్కలు, నైవేద్యం.
7) సంతోషీమాత:-
పులుపులేని పిండివంటలు, తీపిపదార్ధాలు.
8) శ్రీషిరిడి సాయిబాబా:-
పాలు, గోధుమరొట్టెలు నైవేద్యం
9) శ్రీకృష్ణుడు:-
అటుకులతోకూడిన తీపిపదార్ధాలు, వెన్న నైవేద్యం. తులసిదళాలతో పూజించడం ఉత్తమం
10) శివుడు:-
కొబ్బరికాయ, అరటిపండ్లు నైవేద్యంగా, మారేడు దళములు, నాగమల్లి పువ్వులతో అర్చన చేయాలి.
11) సూర్యుడు:-
మొక్కపెసలు, క్షీరాన్నము నైవేద్యం.
12) లక్ష్మీదేవి:-
క్షీరాన్నము, తీపిపండ్లు, నైవేద్యం, తామరపూవులతో పూజించాలి.

మన అనుకూలం, శక్తికొద్దీ దేవుడికి ఏ నైవేద్యం పెట్టినా మంచిదే. కానీ మనఃపూర్తిగా, అంతఃకరణ శుద్ధితో నైవేద్యాలు సమర్పించటం సరైన పూజా విధానం. అన్న ప్రసాదం ఎప్పుడూ అత్యుత్తమైన నైవేద్యంగా భావిస్తారు. అంతేకాదు ఖర్జూరం వంటి ఎండు ఫలాలు, నట్స్ దేవుడికి సమర్పించటం కూడా మంచిదే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News