Vastu Tips for home: మనలో చాలా మంది వాస్తును పాటిస్తారు. దీని ప్రకారమే ఇల్లు, ఆఫీసు తదితర నిర్మాణాలు చేస్తారు. వాస్తు నియమాలను పాటించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. వాస్తు శాస్త్రంలో ప్రతి దిశకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు మనం ఉత్తర దిశకు గురించి మాట్లాడుకుందాం. ఇది సంపదలకు అధిపతి అయిన కుబేరుడు సంబంధించిన స్థలంగా భావిస్తారు. కుబేరుడు అనుగ్రహం కోసం ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం.
కుబేరుడి అనుగ్రహం కలగాలంటే..
**వాస్తు శాస్త్రం ప్రకారం, మీ ఇంట్లోని ఉత్తర దిశలో కుబేరుడు చిత్రపటాన్ని పెట్టండి. దీనితోపాటు నార్త్ ఫేసింగ్ లో డబ్బు లేదా ఖజానాను పెట్టడం వల్ల మీ సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థికంగా మీరు మంచి స్థితిలో ఉంటారు. దీంతోపాటు ఇదే దిశలో కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల వ్యాపారం లాభసాటిగా ఉంటుంది.
**వాస్తును అనుసరించి, ఇంటికి ఉత్తరంలో మనీ ప్లాంట్, తులసి వంటి మొక్కలను పెంచుకోవడం వల్ల మీ ధనం వృద్ధి చెందుతుంది. వెదురు చెట్టును నాటడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
**నార్త్ ఫేసింగ్ లో ఫౌంటెన్, అక్వేరియం, లోహం లేదా స్ఫటిక తాబేలు మొదలైన వాటిని ఉంచడం వల్ల కుబేరుడు ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి.
**ఉత్తర దిశలో నది, జలపాతం వంటి చిత్రాలను పెట్టడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తులు ప్రవహిస్తాయి.
**ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే ప్రధాన తలుపు ద్వారం వద్ద నేమ్ ప్లేట్, విండ్ చైమ్స్ మొదలైన వాటిని ఉంచుకోండి.
Also Read: Neem Plant -వేప చెట్టు ఈ దిశలో నాటితే.. ఆ దోషాలు తొలగిపోతాయి..
ఏయే వస్తువులను ఉంచుకోకూడదు?
ఇంటి ఉత్తర దిశలో బూట్లు, చెప్పులు, చెత్తబుట్ట లేదా బరువైన వస్తువులను పొరపాటున కూడా ఉంచకూడదు. దీని వల్ల కుబేరుడు ఆగ్రహిస్తాడు. దీంతో మీరు అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. అలాగే నార్త్ ఫేసింగ్ ను ఎప్పుడూ మురికిగా ఉంచవద్దు, లేకుండా అది మీ ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తిని అడ్డుకుంటుంది.
Also Read: Vaastu – ఈ దిశలో మనీ ప్లాంట్ పెట్టుకోండి
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా అందించడమైనది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. తెలుగు ప్రభ దీనిని ధృవీకరించలేదు.


