బీచెస్, హిల్స్, సిటీస్ మాత్రమే కాకుండా స్పిరుచువల్ టూరిజంకు మనదేశం కేరాఫ్. కరోనా తరువాత మొక్కులు చెల్లించుకోవటం, లైఫ్ స్టైల్ ఛేంజెస్ కారణంగా కోట్లాది మంది ఇండియన్స్ ఇలా పుణ్యక్షేత్రాలకు పోటెత్తుతున్నారు. శ్రీనగర్, పెహల్గాం, జమ్ముకు కూడా పెద్ద ఎత్తున మనవారు వెళ్తుండటం ఆసక్తికరమైన విషయం. ట్రావెల్ రీకవరీలో సరికొత్త ట్రెండ్ గా వచ్చిచేరిన ట్రెండ్ నార్త్ ఇండియాకు స్పిరుచువల్ టూరిస్టులు పోటెత్తటం. Oyo cultural travel report 2022 ప్రకారం..ఈ ఏడాది వారణాసి సుమారు 10 కోట్ల మందితో కిక్కిరిసిపోయింది. లాంగ్ వీకెండ్స్, పండుగల టైంలో మనదేశంలోని ప్రముఖ ఆలయాలు కనివినీ ఎరుగనంత స్థాయిలో భక్తుల రద్దీతో కనిపిస్తుండటం విశేషం. షిర్డీకి 483 శాతం ఓయో బుకింగ్స్ పెరుగగా, తిరుపతికి 233శాతం, పూరికి 117 శాతం పెరిగినట్టు ఓయో వెల్లడించింది. ఈ లిస్ట్ లో కాశి టాప్ లో ఉండగా తరువాతి స్థానాలు వరుసగా తిరుపతి, పూరి, అమృత్ సర్, హరిద్వార్, షిర్డీ, రిషికేశ్, మథుర, మహాబలేశ్వర్, ముధురై నిలిచాయి. జోన్ వైజ్ చూస్తే నార్త్ లో వారణాసి తరువాత ప్రయాగ్ రాజ్, అమృత్ సర్, హరిద్వార్, కాట్రా, రిషికేశ్ నిలువగా సౌత్ ఇండియాకు వచ్చేసరికి విజయవాడ, మైసూర్, తిరుపతి, మధురై, వెల్లూర్ టాప్ స్పిరుచువల్ డెస్టినేషన్ గా నిలిచాయి. ఈస్ట్ జోన్ లో పూరి, గోవాకు ఎక్కువమంది టూరిస్టులు వచ్చారు. ఇక వెస్ట్ జోన్ లో షిర్డీ తరువాత మహాబలేశ్వర్, నాశిక్, ఉజ్జైన్, పుష్కర్ లు భక్తులను విశేషంగా ఆకట్టుకుని రప్పించుకున్నాయి. రివేంజ్ టూరిజం ఇండియాలో విపరీతంగా పెరగటం కొత్త ట్రెండ్ సెట్ చేసింది.