అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలంలో పెన్నహోబిలంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిసాయి. విగ్రహాలు తరలివెళ్లనున్న సందర్భంగా తెల్లవారు జామునుండే స్వామి వారి మూల విరాట్ కు ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజల జరిపిన అనంతరం పల్లకిలో పెన్నహోబిలం నుండి ఆమిద్యాలకు బోయిలు మోసుకెళ్లారు.
ఈ నెల 20 న అమిద్యాల గ్రామం నుండి ఉత్సవ విగ్రహాలను పెన్నహోబిలం తీసుకురావడంతో ప్రారంభమైనా ఉత్సవాలు తిరిగి అమిద్యాల గ్రామానికి చేరుకోవడంతో ముగిసాయి. అమిద్యాల గ్రామంలో తిరిగి వచ్చిన ఉత్సవ విగ్రహాలకు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం పెన్నోబిలేసు దేవాలయానికి ఉత్సవ విగ్రహాలను చేర్చారు.
ప్రతి ఏడాది ఆమిద్యాల పెన్నోబులేసుని ఆలయం నుంచి బ్రహ్మోత్సవాలకు ముందు రోజు ఉత్సవ విగ్రహాలను పెన్నహోబిలం తీసుకురావడం ఉత్సవాల అనంతరం తిరిగి యధా స్థానానికి చేర్చడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ విజయ్ కుమార్, అర్చకులు ద్వారాకనాథ్ స్వామి, మయూరం బాలాజీ, గుండురావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.