Planetary changes In August 2025: జ్యోతిష్య శాస్త్రం, ఆధ్యాత్మికత పరంగా ఆగస్టు నెల అద్భుతంగా ఉండబోతుంది. ఈ నెలలోనే వరలక్ష్మీ వ్రతం,రక్షా బంధన్, జన్మాష్టమి మరియు వినాయక చవితి వంటి ముఖ్యమైన పండుగలు రాబోతున్నాయి. అంతేకాకుండా ఇదే మాసంలో మూడు ప్రధాన గ్రహాల సంచారాలు జరగబోతున్నాయి.
గ్రహాల యువరాజుగా పిలువబడే బుధుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. ఇతడు ఆగస్టు 09న ఉదయించబోతున్నాడు. ఇది జరిగన రెండు రోజుల తర్వాత అంటే ఆగస్టు 11న బుధుడి ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు.నెల చివరిలో అతడు సింహరాశి ప్రవేశం చేస్తాడు. ఖగోళ రాజ్యానికి రాజు అయిన సూర్యుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. ఇతడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ఆగస్టు 17న ప్రవేశిస్తాడు. ఇతడిని విశ్వాసం, తేజస్సు మరియు నాయకత్వ లక్షణాలను సూచికగా భావిస్తారు. శుక్రుడు కూడా ఆగస్టు 21 తెల్లవారుజామున 1:08 గంటలకు కర్కాటకరాశి ప్రవేశం చేస్తాడు. ఈ మూడు గ్రహాల సంచారం ఏయే రాశులవారికి అనుకూలంగా ఉండబోతుందో తెలుసుకుందాం.
మిథున రాశి
ఈ నెల మిథున రాశి వ్యక్తులకు అదృష్టాన్ని ఇవ్వబోతుంది. అంతేకాకుండా మీరు భారీగా ఇన్వెస్ట్ మెంట్స్ చేస్తారు. అవి భవిష్యత్తులు లాభాలు తెచ్చిపెడతాయి. ఇతరులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. కెరీర్ లో ఊహించని పురోగతిని చూస్తారు. లక్ ఎప్పుడు మీ వెన్నంటే ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అప్పుల బాధ నుండి బయటపడతారు. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు.
మేష రాశి
ఆగస్టు నెలలోని గ్రహ సంచారాలు మేష రాశి వారికి శుభఫలితాలను ఇస్తాయి. అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆర్థిక విషయాల్లో లాభాలు ఉంటాయి. కెరీర్ అవకాశాలు మెరుగుపడతాయి. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. డబ్బు సమస్యలు తీరిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. ఇతరుల స్నేహసంబంధాలు పెరుగుతాయి.
Also Read: Raksha Bandhan 2025 – రాఖీ పండుగ నాడు ఈ గిఫ్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి!
కన్యారాశి
ఆగస్టు నెలలోని గ్రహ మార్పుల కన్యారాశి వారికి ఎంతో మేలు చేస్తాయి. వీరికి పనిచేసే చోట గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తిపరమైన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీకు ఆధ్యాత్మికత మరియు మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా మారే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు పదోన్నతికి లభించే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలోని మనస్పర్థలు తొలగిపోయి అనందంగా గడుపుతారు.
Also Read: Janmashtami 2025- ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగష్టు 15నా లేదా 16నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..


