Thursday, April 3, 2025
HomeదైవంKothakonda Jathara: కొత్తకొండ జాతరలో పోలీసుల సేవలు అనన్య సామాన్యం

Kothakonda Jathara: కొత్తకొండ జాతరలో పోలీసుల సేవలు అనన్య సామాన్యం

సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా నీడన జాతర భద్రత

కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు తెల్లవారు జామున అగ్ని గుండాల కార్యక్రమంతో అంగరంగ వైభవంగా ముగిశాయి. వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా సూచనలతో కాజీపేట డిసిపి బారీ, ఎసిపి డేవిడ్ రాజ్ ఆధ్వర్యంలో ఎల్కతుర్తి సీఐ ప్రవీణ్ కుమార్, ముల్కనూర్, వంగర, ఎల్కతుర్తి ఎస్సైలు సాయిబాబు, నీలోజు వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్ నేతృత్వంలో పోలీసులు పగడ్బందీ ఏర్పాట్లు చేసి జాతర బందోబస్తును నిర్వహించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా నీడన జాతర బందోబస్తును నిరంతరం పర్యవేక్షించారు. జాతర విజయవంతానికి సహకరించిన పోలీస్ సిబ్బందికి సిఐ ప్రవీణ్ కుమార్ శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఈవో కిషన్ రావు పోలీస్ సిబ్బందికి తీర్థ ప్రసాదాలు అందించి, వేద పండితులు ఆశీర్వదించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News