HomeదైవంRains and names: వానలు ఎన్నిరకాలో తెలుసా?
Rains and names: వానలు ఎన్నిరకాలో తెలుసా?
- గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన
- మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన
- మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన
- దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన
- సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన
- సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన
- బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన
- తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన
- సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన
- ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన
- మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన
- ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన
- కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన
- ముసురువాన = విడువకుండా కురిసే వాన
- దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన
- బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన
- రాళ్లవాన = వడగండ్ల వాన
- కప్పదాటువాన = అక్కడక్కడా కొంచెం కురిసే వాన
- తప్పడతప్పడవాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
- దొంగవాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన
- కోపులునిండేవాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన
- ఏక్దారవాన = ఏకధారగా కురిసే వాన
- మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన
- సాలేటివాన = భూమి తడిసేంత భారీ వాన
- సాలుపెట్టువాన = దున్నేందుకు సరిపోయేంత వాన