Lunar Eclipse 2025:ఈ నెల 7వ తేదీ రాత్రి ఆకాశం ఒక ప్రత్యేకమైన సంఘటనకు సాక్ష్యమివ్వనుంది. గత పది సంవత్సరాల కాలంలో కనిపించిన గ్రహణాల్లో ఇదే అత్యంత ప్రకాశవంతమైన చంద్రగ్రహణంగా నమోదు కానుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమై, తెల్లవారుజామున 2 గంటల 25 నిమిషాలకు ముగియనుంది. మధ్యలో రాత్రి 11 గంటలకు చంద్రుడు పూర్తిగా గ్రహణంలోకి వెళ్ళి, సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.
కళ్లతోనే గ్రహణాన్ని..
ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల ప్రజలు ఈ అద్భుతాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా దేశాల్లోని కొన్ని ప్రాంతాలను మినహాయిస్తే మిగతా దేశాల ప్రజలకు ఈ అరుదైన దృశ్యం కనిపిస్తుంది. ఆకాశం మేఘావృతమై లేకపోతే కళ్లతోనే గ్రహణాన్ని వీక్షించవచ్చని నిపుణులు తెలిపారు.
ఎరుపు రంగులో..
ఇంటి పైకప్పుపై లేదా బహిరంగ ప్రదేశంలో నిలబడి చంద్రుడిని నేరుగా చూడవచ్చు. ఎవరి వద్ద టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా చంద్రుడి రూపాన్ని పరిశీలించవచ్చు. సంపూర్ణ గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో మెరవడం అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది సాధారణంగా “బ్లడ్ మూన్” అనే పేరుతో ప్రసిద్ధి పొందింది.
సంపూర్ణంగా భూమి..
ఈ గ్రహణం ప్రారంభమయ్యే సమయం రాత్రి 8:58. చంద్రుడు క్రమంగా నీడలోకి వెళ్ళడం మొదలవుతుంది. రాత్రి 11 గంటలకు సంపూర్ణంగా భూమి నీడలోకి వెళ్లి ఆకాశంలో ఎరుపు రంగు వెలుగులో మెరుస్తాడు. చివరికి తెల్లవారుజామున 2:25 గంటలకు ఈ గ్రహణం పూర్తిగా ముగుస్తుంది.
చంద్రుడు ఎర్రటి వర్ణంలో…
జ్యోతిశాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది చంద్రుడు భూమి నీడలోకి ప్రవేశించినప్పుడు ఏర్పడుతుంది. భూమి సూర్యుడు, చంద్రుడు మధ్యలో రావడంతో చంద్రుడిపై సూర్య కాంతి పడకుండా, భూమి నీడ మాత్రమే పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు ఎర్రటి వర్ణంలో కనబడతాడు. ఇదే కారణంగా దీనిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు.
శాస్త్రవేత్తల ప్రకారం చంద్రగ్రహణాలు సహజమైన సంఘటనలు. వీటిని చూడటానికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేదు. కళ్ళతోనే చంద్రుడిని వీక్షించడం సురక్షితం. అయితే టెలిస్కోప్ లేదా బైనాక్యులర్ ఉపయోగిస్తే మరింత ఆసక్తికరంగా, స్పష్టంగా చంద్రుడి రూపం కనిపిస్తుంది.
ఈ సారి ఏర్పడుతున్న చంద్రగ్రహణం దశాబ్ద కాలంలోనే అత్యంత ప్రకాశవంతమైనదిగా చెబుతారు. ఇంత విభిన్నంగా ప్రకాశించే చంద్రుడిని చూడటానికి శాస్త్రప్రియులు, ఆకాశ వీక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చంద్రుడు పూర్తిగా ఎరుపు రంగులో మెరవడం అరుదుగా జరిగే సంఘటన. అందువల్ల ఈ చంద్రగ్రహణం ప్రత్యేకతను సంతరించుకుంది.


