Tuesday, September 17, 2024
HomeదైవంSesha Vastralu: అమ్మవారి చీరలను మహిళా భక్తులు ధరించవచ్చా ?

Sesha Vastralu: అమ్మవారి చీరలను మహిళా భక్తులు ధరించవచ్చా ?

సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి అలంకరింప చేసిన చీర (శేష) వస్త్రాన్ని భక్తులు (మహిళలు) ధరించవచ్చా..? అందులో లాభాలేంటి ? పాటించాల్సిన నియమాలేంటి? ఈవిషయాలను మహిలందరూ తెలుసుకోవాలి. శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో కొలువుదీరి ఉంటారు. పురుషులకంటే ఎక్కువగా మహిళలు ఆదేవాలయాలకు క్యూ కడుతుంటారు. పూలు, కుంకుమ,గాజులు,చీరె, రవికెలను కానుకలుగా సమర్పిస్తుంటారు. ఆచీరను విశేషమైన రోజుల్లో అమ్మవారి మూలమూర్తికి అలంకరింప చేయమని పూజారులకు చెబుతుంటారు. ఆ తర్వాత ఇలాంటి చీరెలను ఆలయ నిర్వాహకులు భక్తుల సమక్షంలో వాటిని వేలం వేస్తుంటారు. ఆ చీరె దక్కితే చాలని చాలా మంది భక్తులు వేలంలో కొనుక్కుంటుంటారు.
అయితే అసలు అమ్మవారి శేషవస్త్రంను సాధారణ మహిళలు ధరించవచ్చా ? అనే సందేహం కొంతమందికి ఉంటుంది. అమ్మవారి చీరెలను ధరించవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతూ ఉన్నాయి.
కానీ, ధరించినప్పుడు మహిళలు పాటించాల్సిన నియమాలేమిటి? ఎంత సంతోషంగా వేలం పాటలో సొంతం చేసుకుంటామో ఆ చీరెను ధరించినప్పుడు కూడా అంతే పవిత్రంగా ఆమహిళలు ఉండాలి. అందుకు కొన్ని నియమాలను పాటించాలని అంటున్నాయి.

- Advertisement -

అమ్మవారి శేషవస్త్రాన్ని ధరించే ముందు తిథి, వర్జ్యం చూసుకుని “శుక్రవారం” రోజున అమ్మవారి చీరను ధరించవచ్చు. అది కూడా ఉదయం వేళలో కొంతసేపు మాత్రమే ధరించాలి. ఈచీరెను ధరించినంత సేపు ప్రశాంతత కలుగుతుంది. అలాగే మనం కూడా ప్రశాంతంగా ఉండాలి. మంచి ఆలోచనలు కలిగి ఉండాలి. రాత్రి సమయాల్లో ఈ చీరెను ధరించ కూడదు. ఆ చీరెను ఎప్పుడు ఉతికినా ఆ నీటిని ఎక్కడపడితే అక్కడ కాకుండా మొక్కలకు పోయాలి.

కానీ మీరంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అమ్మవార్లకు సమర్పించే చీరలు, సారెలు అన్నీ అమ్మవారి విగ్రహానికి అలంకరించరు. కేవలం కొన్ని మాత్రమే అమ్మవార్లకు అలంకరిస్తారు. అలాంటి చీరలకు ఈ నియమాలు పాటించటం శుభకరం. విజయవాడ దుర్గమ్మ, తిరుపతిలో అలివేలి మంగమ్మ, శ్రీశైలం భ్రమరాంబిక ఇలా అమ్మవార్ల గుళ్లలో నిత్యం భక్తులు చీరలు సమర్పించేస్తూ ఉంటారు. వీటిలో కొన్ని అమ్మవారికి తాకిస్తారు అంతే.

అలాగే అయ్యవార్లకు అంటే స్వాములకు భక్తి పూర్వకంగా సమర్పించే పట్టు, చేనేత వస్త్రాలను మగవారు ధరించేటప్పుడు కూడా ఇలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వాటి పవిత్రతకు భంగం వాటిల్లదు. కాబట్టి మీరు నిర్భయంగా అమ్మవారివి, అయ్యవారివి శేష వస్త్రాలు కొని, ఉపయోగించవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News