Sunday, July 7, 2024
HomeదైవంSivarathri: మహాశివరాత్రి పర్వదిన విశిష్టత

Sivarathri: మహాశివరాత్రి పర్వదిన విశిష్టత

హిందువుల పవిత్రమైన పండుగలో శివరాత్రి ఒకటి ప్రతినెల కృష్ణ చతుర్దశి రోజున శివరాత్రి వస్తుంది. దీనిని మాస శివరాత్రి అంటారు. ఆ రోజున శివాలయాల్లో విశేష పూజలు చేస్తారు. అందులో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రిని మహాశివరాత్రి పర్వదినంగా జరుపుకుంటున్నాం.
ఆదిదేవుడు, ఆది మద్యాంతరహితుడు, నిర్గుణ నిరా కార నిరామయుడు శివుడు. శంభో శంకర ఓం నమశ్శి వాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే చాలు ఆ బోలా శంకరుడు కరుణించి కోరిన కోరికలు తీర్చి వరాలను ప్రసా దిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శుభాలను ఇచ్చే వాడు దేవతలకే దేవుడు కనుక మహాదేవుడు ఆదిదేవుడు. గంగను తలపై మోసే గంగాధరుడు పార్వతి దేవిని తనలో దాచుకున్న అర్ధనారీశ్వరుడు మూడు కన్నుల వాడు ముక్కంటి. విషాన్ని గొంతులో దాచుకున్న గరళ కంఠుడు ఇలా శివుడికి ఉన్న నామాలు అనేకం.
శివమంటే మంగళం శివుడు మంగళప్రదాత
శివరాత్రి నాడు చేసే నియమాలతో చాలా ప్రధాన మైనది ఉపవాసం, జాగరణ. ఉపవాసం అంటే కొన్ని పండ్లు పండ్ల రసాలు తీసుకుంటూ శివ లీలలు తెలుసు కుంటూ భగవంతునికి సమీపంలో ఉంటూ మొత్తం సమ యాన్ని భగవంతుని సేవలో గడపడం ఉపవాసం.
జాగరణ అంటే రాత్రి వేళలో మేలుకొని భగవంతుని గురించి కథలు గాని స్తుతులు గాని ధ్యానం భజనలు స్తోత్రాలు చేస్తూ మనసును శివుడి మీద కేంద్రీకరించి గడ పటం నిజమైన జాగరణ. శివపార్వతుల కళ్యాణం లింగో ద్భవం ఆరోజునే జరిగాయని ఐతిష్యం. శివరాత్రి రోజున దేవాలయాలన్నీ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలు గొందుతాయి. మన తెలంగాణ రాష్ట్రాల్లో ద్రాక్షారామం శ్రీశైలం శ్రీకాళహస్తి కాలేశ్వరం వరంగల్‌ వంటి పట్టణాల్లో ఉన్న చారిత్రకమైన శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంలో అలరారుతుంటాయి. శివ ధర్మంతో చేసిన చిన్న పూజ కూడా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. అందులో శివరాత్రి రోజు చేసే శివారాధన మరింత పుణ్యఫలం.
పురాణాలలో వర్ణించబడిన శివరాత్రి చరిత్ర
ఒకనాడు బ్రహ్మ విష్ణువు నివసించే వైకుంఠానికి వెళ్ళాడట. పాలసముద్రంలో ఆదిశేషునిపై మహావిష్ణువు యోగ నిద్రలో ఉండగా బ్రహ్మ అక్కడికి వెళ్ళాడు. సమస్త సృష్టి కారకుడును నేను కొంచెం కూడా గౌరవ మర్యాదలు లేకుండా నిద్రిస్తున్నావని మహావిష్ణువుపై బ్రహ్మ కోపించ సాగాడు. అప్పుడు ఆ విష్ణువు నువ్వు నా నాభి కమలం నుండి పుట్టిన వాడవు నువ్వు నాకు చెప్పడం ఏంటని ఇద్దరి మధ్య మాట మాట పెరిగి తగాదాగా మారి చివరికి ఒకరిపై ఒకరు బాణాలు సంధించుకునే వరకు వచ్చింది. ఈ ప్రళయాన్ని గ్రహించిన దేవతలు ఈశ్వరున్ని శరణు వేడగా పరమేశ్వరుడు తమ భూత గణాలు యుద్ధ గణాలతో వచ్చి ఒక పొడవాటి అగ్నిస్తంభంగా మారి బ్రహ్మ విష్ణువుల మధ్య నిలిచాడు. వారు సంధించిన మహేశ్వర పాశుపతాస్త్రాలను తనలో ఐక్యం చేసుకున్నాడు. ఈ కార ణంగానే శివుడు లింగ రూపంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆ వింతను చూసి కంగుతిన్న బ్రహ్మ విష్ణువులు అంత శక్తివంతమైన అస్త్రాలను తనలో ఐక్యం చేసుకున్న అగ్నిస్తంభం యొక్క ఆది అంతం తెలుసు కోవాలని బలాబలాలు నిరూపించుకోవాలని విష్ణువు వరాహరూపంలో బ్రహ్మ హంసరూపం ధరించి ఆది అం తాలను కనుక్కోవడానికి బయలుదేరారు. వారు కొన్నివేల సంవత్సరాలు వెతికిన కూడా అగ్నిస్తంభం యొక్క ఆది అంతాలను కనుక్కోలేకపోయారు. శ్రీమహావిష్ణువు ప్రయా ణం మొదలుపెట్టిన చోటికి వచ్చేసాడు. బ్రహ్మకు తన ప్రయాణంలో ఒక కామధేనువు ఒక మొగిలి పువ్వుతో స్నేహం ఏర్పడింది. మహావిష్ణువుతో బ్రహ్మ అగ్నిస్తంభం యొక్క ఆ విభాగాన్ని చూశాడని అందుకు మేము సాక్ష్యం అని అబద్ధం చెప్పిస్తాడు. అప్పుడు అది నిజమే అని బ్రహ్మ దేవుడు గొప్పవాడని ఒప్పుకొని షోడశోపచారాలతో అత్యంత భక్తి శ్రద్దలతో విష్ణువు కొలుస్తుండగా, అది గ్రహిం చిన పరమేశ్వరుడు అక్కడకు వచ్చి బ్రహ్మ నిజంగానే స్తంభం యొక్క మొదలు భాగాన్ని చూశాడా అని అడగగా కామధేనువు ముఖ భాగంతో చూశాడని వెనక భాగంలో చూడలేదని సమాధానం ఇచ్చింది. మొగిలి పువ్వు మాత్రం చూశాడని అబద్ధం చెప్పింది. వారు చెప్పిన అబద్ధాన్ని విష్ణువుకు జరిగిన అన్యాయాన్ని చూసి కోపిం చిన శివుడు అబద్ధం చెప్పిన మొగిలిపువ్వు ఏ పూజకు పనికి రాదని, అబద్ధం చెప్పినా ఆవు ముఖ భాగం పూజకు పనికి రాదని నిజం చెప్పిన ఆవు వెనక భాగం పవిత్రమైనదిగా దేవతలు కొలుస్తున్న ప్రాంతంగా గోమూత్రం ఆవు పాలు ఆవు పేడ ఎంతో ప్రసిద్ధి చెందుతాయని చెప్పాడట. అబద్ధం చెప్పడం వల్ల బ్రహ్మకు భూమండలంలో ఎక్కడ కూడా పూజలు గుళ్ళు గోపురాలు ఉండవని పంపించాడు ఈశ్వ రుడు. పశ్చాత్తాపంతో మొగిలిపువ్వు శాప విముక్తిని వేడు కోగా నా పూజకు తప్ప దేవతారాధనకు పనికి రావని, బ్రహ్మ యజ్ఞం సమయంలో మాత్రమే గురువుగా పూజింప బడతాడు అని శాపాన్ని కొంత సడలించాడు.
మోసాన్ని గ్రహించక విష్ణువు బ్రహ్మకు చేసిన సేవ గాను శ్రీమహావిష్ణువు నాతో సమానంగా పూజలు అందు కుంటాడని అనేక క్షేత్రాల్లో వెలుగొందుతాడని వరమి చ్చాడు పరమశివుడు. ఇదంతా జరిగింది కూడా మహా శివరాత్రి పర్వదినం రోజుననే కాబట్టి శివరాత్రి అత్యంత పవిత్రమైనది.
పాలసముద్రం చిలికినప్పుడు మొదటగా వచ్చింది ఆలాహలం. దాన్ని తన కంఠంలో దాచాడు శివుడు. నిద్రిస్తే శరీరం అంతట వ్యాపిస్తుందని శివుడికి నిద్ర రాకుండా దేవతలందరూ ఐదు జాముల కాలం గడిపారట. ఆ కాలాన్ని మహా శివరాత్రి అంటారని మరొక కథ ప్రచారం లో ఉంది. హిందూ పురాణాల ప్రకారం లింగం అంటే అంతం లేని శక్తి అని అర్థం. శివుడు కట్టుకునే పులి చర్మం ఒంటికి రాసుకునే బూడిద తలమీద చంద్రుడు, గంగమ్మ మెడలో వేసుకునే పాములు ఇవన్నీ గ్రహిస్తే శివుడు ప్రకృతి ప్రేమికుడనీ ఈ విశ్వం ఈ ప్రకృతి శివుని సృష్టేనని శివుడి ఆహార్యం అంతా ప్రకృతి మయమని గ్రహించవచ్చు.
కాళిదాసు గురు చరిత్రలో చెప్పినట్లు
వాగర్థావివ,సంపృక్తౌ
వాగర్థ ప్రతిపత్తయే,
జగతః పితరౌ,వందే,
పార్వతీ పరమేశ్వరౌ
అనే మాట అర్థం సూర్యుడు వెలుగు, చంద్రుడు వెన్నెల, అగ్ని వేడి ఏ విధంగా అయితే విడదీయబడవో అలాంటి అనుబంధం పార్వతీ పరమేశ్వరులది. శివపార్వ తులు శివ శివాని, భవ భవాని, పార్వతీ పరమేశ్వరులు అని నామాల్లో వర్ణిస్తారు.
శివుడు అభిషేక ప్రియుడు
శివరాత్రి నాడు చేసే అభిషేకం బిల్వదళాలతో అర్చ్రించడం ద్వారా శివ పూజకు మరింత విశిష్టత చేకూరు తుంది. అర్థరాత్రి కోటి వెలుగుల కాంతులతో లయకారుడు ఉద్భవించే లింగోద్భవ కాలంలో దేవదేవుని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగి ఆత్మసాక్షాత్కారంతో కోరిన కోరికలు తీరుస్తాడని భక్తుల ప్రకాడ విశ్వాసం. పగలంతా ఉపవాసం రాత్రంతా జాగరణ నోరార శివనామ స్మరణం చేసిన ప్రతి ఒక్క భక్తుడిపై ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలు ప్రసరిం చాలని మనసారా కోరుకుందాం.

కొమ్మాల సంధ్య
తెలుగు అధ్యాపకురాలు
-9154068272.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News